Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/12/2024)

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/12/2024)
x
Highlights

Telugu Horoscope Today, December 6, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Telugu Horoscope Today, December 6, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి : పంచమి మధ్యాహ్నం గం.12.07 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: శ్రవణము సాయంత్రం గం.5.18 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట

అమృతఘడియలు: ఉదయం గం.6.58 ని.ల నుంచి గం.8.33 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.9.13 ని.ల నుంచి గం.10.48 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.47 ని.ల నుంచి గం.9.32 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.30 ని.ల నుంచి గం.1.14 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.44 ని.ల నుంచి గం.12.07 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.33 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 5.41 ని.లకు

మేషం

వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. మీకు ఇష్టమైన రంగంలో నైపుణ్యాన్ని సంపాదిస్తారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. సంతానం గురించి శుభవార్త అందుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృషభం

గతంలో చేసిన మంచి పనుల ఫలితం దక్కుతుంది. ధార్మిక తత్త్వం బోధపడుతుంది. న్యాయ నిపుణులకు అనువుగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. గురువులపూ భక్తిని చాటుతారు. దూరప్రయాణం ఉంది.

మిథునం

పనుల పూర్తికి కష్టపడాలి. ఆటంకపరిచే వారు ఎక్కువగా ఉంటారు. ప్రయత్నాలను విరమించకండి. వారసత్వ ఆస్తి వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం

వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. దత్తత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభ కార్యాలకు వెళతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులను గెలుస్తారు. ఆశ్రితులకు అవసరమైన సాయం చేస్తారు.

సింహం

బలహీనతలను అధిగమిస్తారు. కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. మానసిక భయం తొలగిపోతుంది. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. భాగస్వాముల మధ్య వివాదం పరిష్కారం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

పనుల పూర్తికి బాగా కష్టపడాలి. రహస్య విరోధుల కదలికలపై దృష్టి పెట్టండి. సాహిత్య రంగంలోని వారు ప్రశంసలను అందుకుంటారు. సంతానం గురించి ఆలోచిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. ఖర్చు తగ్గించాలి.

తుల :

ఆశించిన స్థాయిలో పని జరగదు. శత్రువుల వల్ల అభీష్టం నెరవేరదు. ఆర్థిక ప్రయోజనాలు దక్కవు. వ్యవసాయ దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విపరీతమైన ఖర్చులుంటాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది.

వృశ్చికం

భావాన్ని చక్కగా చెప్పగలిగే నేర్పుతో పనులను చక్కబెట్టుకుంటారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. సోదరులకు అండగా ఉంటారు. దైవభక్తి పెరుగుతుంది. బంధాలు బలపడతాయి. కీలక సమయంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు.

ధనుస్సు

పనులు సవ్యంగా సాగవు. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. ఆదాయానికి మించి ఖర్చుంటుంది. ప్రయాణం వల్ల లాభముండదు. నోటిదురుసును తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

మకరం

ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. తగినంత డబ్బు చేతికి అందుతుంది. నచ్చని వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తారు. సంతానం గురించి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. గౌరవం పెరుగుతుంది.

కుంభం

పనులు ఆశించిన స్థాయిలో జరగవు. అనూహ్యమైన చిక్కులు వస్తాయి. ఉద్యోగులకు దూర ప్రాంత బదిలీ సూచిస్తోంది. తొందరపాటు చర్య వల్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. శత్రువుల కదలికలపై నిఘా ఉంచండి.

మీనం

అన్ని పనుల్లోనూ శుభ ఫలితాలుంటాయి. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. రాబడి పెరుగుతుంది. సాంస్కృతిక రంగంలోని వారికి బాగుంటుంది. మిత్రులు తోడుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆకాంక్ష నెరవేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories