Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి ప్రభావం: ఈ మూడు రాశులకు డబుల్ అదృష్టం.. రాజయోగం కూడా ఖాయం!

Tholi Ekadashi 2025
x

Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి ప్రభావం: ఈ మూడు రాశులకు డబుల్ అదృష్టం.. రాజయోగం కూడా ఖాయం!

Highlights

Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి హిందూ ధార్మిక చారిత్రంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశిగా వచ్చే ఈ రోజు, శ్రీ మహావిష్ణువు కోసం ప్రత్యేకంగా పూజలు చేసే సమయం. ఈసారి జూలై 6 (ఆదివారం) న జరగనున్న తొలి ఏకాదశి మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటోంది, ఎందుకంటే ఆ రోజున సూర్యుడు మరియు శ్రీ మహావిష్ణువు అనుకూల స్థితిలో ఉండనున్నారు.

ఈ రోజున చేసే వ్రతాలు, ఉపవాసం, మౌనవ్రతం వంటి కార్యాలు వెయ్యిరెట్లు ఫలితాన్నిస్తాయని పండితులు చెబుతున్నారు. దీనివల్ల 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే, మూడు రాశుల వారికి మాత్రం ఇది అసాధారణమైన లాభాలను, అదృష్టాన్ని తీసుకొస్తుంది. అవేంటో చూద్దాం…

వృశ్చిక రాశి (Scorpio)

సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

♦ ఆలస్యం అవుతున్న శుభకార్యాలు సాఫీగా పూర్తవుతాయి.

♦ కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

♦ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహ బంధం కుదురుతుంది.

♦ సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

♦ ఖ్యాతి, పేరుప్రఖ్యాతులు పొందుతారు.

మీన రాశి (Pisces)

♦ ఎదురుచూస్తున్న డబ్బులు చేతికి అందుతాయి.

♦ మీ వల్ల సోదరులకు లాభం కలుగుతుంది.

♦ ఆకస్మిక ధనప్రాప్తి జరుగుతుంది.

♦ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు.

♦ భూముల కొనుగోలు జరుగుతుంది.

♦ చేపట్టిన పనులన్నీ ఆపకుండా పూర్తవుతాయి.

తులా రాశి (Libra)

♦ విదేశీ ప్రయాణాలకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

♦ సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు.

♦ భార్య తరపు ఆస్తులు మీకు లభించే అవకాశం.

♦ లాటరీలు, షేర్లు వంటి బాండ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో లాభం.

♦ ఆర్థికంగా స్థిరత పెరుగుతుంది.

ఈ శుభదినాన ఉపవాసం చేయడం, పూజలు చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. పై మూడు రాశుల వారు ప్రత్యేకంగా దీన్ని వినయంగా జరుపుకుంటే... అదృష్టం తలుపులు తట్టడం ఖాయం!

Show Full Article
Print Article
Next Story
More Stories