Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు 12 జనవరి 2026: ఆ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు 12 జనవరి 2026: ఆ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
x
Highlights

Today Horoscope in Telugu: మేషం: వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది....

Today Horoscope in Telugu: మేషం: వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

---------------------------------------

వృషభం: నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

---------------------------------------

మిధునం: ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి.

---------------------------------------

కర్కాటకం: ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి.

---------------------------------------

సింహం: మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. శుభ కార్యములకు ధనవ్యయం చేస్తారు.

---------------------------------------

కన్య: ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమౌతాయి.

---------------------------------------

తుల: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

---------------------------------------

వృశ్చికం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు.

---------------------------------------

ధనస్సు: ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం: ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం: సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి.

---------------------------------------

మీనం: ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories