Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 23 July 2024

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 23 July 2024
x

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 23 July 2024

Highlights

Today Horoscope in Telugu, 23 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 23 మంగళవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu, 23 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 23 మంగళవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం.

తిధి: విదియ ఉదయం గం.10.23 ని.ల వరకు ఆ తర్వాత తదియ.

నక్షత్రం: ధనిష్ట రాత్రి గం.8.18 ని.ల వరకు ఆతర్వాత శతభిషం.

అమృతఘడియలు: ఉదయం గం.10.47 ని.ల నుంచి గం.12.15 ని.ల వరకు.

వర్జ్యం: ఈ అర్ధరాత్రి దాటాక గం.2.53 ని.ల నుంచి తె.వా.గం.4.21 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.24 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.18 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.02 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.3.38 ని.ల నుంచి గం.5.15 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం.5.57 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం.6.52 ని.లకు.


మేషం :

అభీష్టం నెరవేరుతుంది.ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనం అందుతుంది. అధికారుల విశ్వాసాన్ని పొందుతారు. మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. దైవక్షేత్రాన్ని సందర్శిస్తారు. పోయిన వస్తువు తిరిగి లభిస్తుంది.


వృషభం :

వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. మీకు తెలిసే కొత్త విషయాల్లో నచ్చనివి ఎక్కువగా ఉంటాయి. ఇతరులపై నమ్మకాన్ని కోల్పోతారు. ఆత్మీయులకు కీలక సమాచారాన్నిస్తారు. అనవసర ప్రయాణాలు వద్దు.


మిథునం :

తొందరపాటు వల్ల నిందలు పడతారు. విదేశీ వాణిజ్య వ్యవహారాలు సజావుగా సాగవు. అగ్రిమెంట్లు చేసుకునేందుకు అనుకూలం కాదు. ప్రయాణాలు వాయిదా వేయండి. తల్లి తరఫు ఆస్తి చిక్కుల్లో పడుతుంది.


కర్కాటకం:

పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. పోయిన సొత్తు తిరిగి లభిస్తుంది. తల్లికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. మీ శత్రువులకు నష్టం వస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.


సింహం :

ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. మేనమామ సహకారం లభిస్తుంది. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. సేవా రంగంలోని వారికి ప్రశంసలు లభిస్తాయి. కఫ సంబంధ సమస్యలను అశ్రద్ధ చేయకండి.


కన్య :

బుద్ధి బలంతో కార్యదక్షతను నిరూపిస్తారు. ఆర్థిక లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని కీలక రహస్యాలను దాచాల్సిన పరిస్థితి ఉంటుంది. జూదాల్లో నష్టపోయే సూచన ఉంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.


తుల :

పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. తల్లి తరఫు బంధువులతో విభేదిస్తారు. విద్యారంగంలోని వారికి ఆటంకాలు పెరుగుతాయి. ఔషధ సేవనం గోచరిస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.


వృశ్చికం :

ఇష్టకార్యం సిద్ధిస్తుంది. అవసరానికి తగ్గంత డబ్బు సమకూరుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తమ్ముళ్లు అండగా ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి పంపకాలు కొలిక్కి వస్తాయి.


ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగా సాగవు. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీలకు అనువుగా ఉండదు. కీలక వ్యవహారాలు బెడిసి కొడతాయి. జూదాల్లో నష్టపోతారు. కంటి సమస్య ఉంటుంది.


మకరం :

పనులు సవ్యంగా జరుగుతాయి. కీలక సమయంలో హూందాగా వ్యవహరిస్తారు. మీ నడవడికకు ప్రశంసలు లభిస్తాయి. ధన సమస్యలు ఉండవు. పౌరుషానలకు అనువు కాదు. ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది.



కుంభం :

పనిపై శ్రద్ధ పెంచాలి. వైవాహిక జీవితంలో సమస్యలొస్తాయి. ఇంటికి దూరమయ్యే పరిస్థితి ఉంది. నిద్రలేమి వేధిస్తుంది. రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు. మనశ్శాంతి దక్కదు. పెద్దల సలహాలు తీసుకోండి.


మీనం :

అనుకున్న ప్రకారమే పనులు సాగుతాయి. కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనురాగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. సోదరులకు సంబంధించిన శుభవార్తను వింటారు.



Show Full Article
Print Article
Next Story
More Stories