Naga Panchami: నేడు నాగ పంచమి.. ఈ 4 రాశులవారికి ధనలాభం ఖాయం! ఈ పరిహారం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మీదే

Naga Panchami
x

Naga Panchami: నేడు నాగ పంచమి.. ఈ 4 రాశులవారికి ధనలాభం ఖాయం! ఈ పరిహారం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మీదే

Highlights

Naga Panchami 2025: శ్రావణ మాసం వచ్చిందంటే పండుగల సందడి మొదలవుతుంది. శుభదినాలుగా పరిగణించే ఈ మాసంలో తొలి ప్రధాన పండుగ నాగపంచమి. ఈ ఏడాది నాగపంచమి మంగళవారం రావడంతో మరింత మంగళకరమని పండితులు పేర్కొంటున్నారు.

Naga Panchami 2025: శ్రావణ మాసం వచ్చిందంటే పండుగల సందడి మొదలవుతుంది. శుభదినాలుగా పరిగణించే ఈ మాసంలో తొలి ప్రధాన పండుగ నాగపంచమి. ఈ ఏడాది నాగపంచమి మంగళవారం రావడంతో మరింత మంగళకరమని పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తిపూర్వకంగా పూజిస్తే సర్వరోగ నివారణతో పాటు సంపద చేకూరుతుందని నమ్మకం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ నాగపంచమి నాడు మేష, కుంభ, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు లభించనున్నాయి. వీరి ఆర్థిక స్థితిలో మెరుగుదలతో పాటు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.

ఈ రాశుల వారు సంపన్నులవుతారు

మేష రాశి: దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

కుంభ రాశి: మానసిక ప్రశాంతత, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. "ఓం నాగదేవతాయ నమః" మంత్రాన్ని జపించడం అనుకూలం.

ధనుస్సు రాశి: కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూల సమయం. శివుడికి స్వీట్లతో నైవేద్యం సమర్పించాలి.

మకర రాశి: ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు సూచన. నల్ల నువ్వులు సమర్పించి అన్నదానం చేయడం శ్రేయస్కరం.

ఇతర రాశుల వారి కోసం ప్రత్యేక పరిహారాలు

వృషభం: వెండి నాణెం నదిలో వదలడం వల్ల అదృష్టం.

మిథునం: పెసరపప్పు దానం చేయాలి, శివుడిని ఉపవాసంతో పూజించాలి.

కర్కాటకం: కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వదలాలి, జలాభిషేకం శుభం.

సింహం: ఎండు కొబ్బరికాయ దానం చేయాలి, శివుడికి జలాభిషేకం.

కన్యా: అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి, జలాభిషేకం శుభప్రదం.

తులా: శివాలయంలో చాలీసా పఠించాలి, భోజనం/ధనం దానం చేయాలి.

వృశ్చికం: శివుడు, వినాయకుడిని పూజించి పసుపు లడ్డూ నైవేద్యంగా పెట్టాలి.

మీనం: శివుడికి రుద్రాభిషేకం చేయించాలి, ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలి.

నాగపంచమి తిథి మరియు పూజ సమయం

తేదీ: జూలై 29, మంగళవారం

పూజ సమయం: ఉదయం 5:41 నుండి 8:23 వరకు

నాగ పంచమి రోజున చేయాల్సిన పూజలు

తెల్లారే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.

♦ నాగదేవతలకు పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేయాలి.

♦ శివాలయానికి వెళ్లి బిల్వపత్రాలతో పూజ చేయాలి.

♦ నాగుడి ప్రతిమను ఆవు పేడతో ఇంటి ముందు వేసి పూజించాలి.

♦ మంత్రపఠనం, హారతి, దానం, ఉపవాసం పాటించడం శ్రేయస్కరం.

ఈ పర్వదినాన్ని శ్రద్ధతో జరుపుకుంటే, సర్ప దోషం నివారణ, సంపద, ఆరోగ్యం వంటి అనేక లాభాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నాగ దేవాలయాలు ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories