Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Rasi Phalalu Check Zodiac Wise Results For Daily Horoscope In Telugu 25 June 2024
x

Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Highlights

Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

25-06-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్టమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణపక్షం

తిధి : చవితి రాత్రి గం.11.10 ని.ల వరకు తర్వాత పంచమి

నక్షత్రం: శ్రవణం మధ్యాహ్నం గం.2.32 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట

అమృతఘడియలు: రాత్రి గం.11.14 నుంచి గం.11.57 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.18 ని.ల నుంచి గం.7.48 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.22 ని.ల నుంచి గం.9.15 ని.ల వరకు తిరిగి రాత్రి గం.11.14 ని.ల నుంచి గం.11.57 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.36 ని.ల నుంచి గం.5.15 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు


మేషం :

ఆశించిన ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. మిత్రులు తోడుగా ఉంటారు. మీ కార్యదక్షతకు ప్రశంసలు వస్తాయి.


వృషభం :

పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తి వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. ఉన్నత విద్యకు సంబంధించి చికాకులు వస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. మానసిక అశాంతి ఏర్పడుతుంది.


మిథునం :

కార్యాలు అనుకున్నట్లుగా జరగవు. బీమా సంస్థలతో వ్యవహారాల్లో చిక్కులొస్తాయి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురవుతారు. శరీరానికి గాయాలయ్యే సూచన ఉంది. తగాదాలకు దూరంగా ఉండడం మేలు.


కర్కాటకం:

అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లు సాగుతాయి. వాహనసుఖం ఉంది. బంధాలు గట్టిపడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది. రోజంతా వినోదంగా గడుపుతారు.


సింహం :

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. ఉదర సంబంధ సమస్యలు తొలగుతాయి. కీర్తి పెరుగుతుంది. ఇంటికి అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తారు. బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు.


కన్య :

బద్ధకాన్ని వదిలి కష్టపడాల్సి వుంటుంది. పనులు అనుకున్నట్లుగా సాగవు. రకరకాల ఆలోచనలు, అనుమానాలు వస్తాయి. రహస్యాలను బయటపెట్టకండి. వాత సంబంధ సమస్యలుంటాయి. నిరాశ వద్దు.


తుల :

ఒడుదుకులు ఎదురైనా కార్యాలను సాధిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పరిశ్రమల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లుగా సాగవు. మానసిక ఒత్తిడులు ఉంటాయి.


వృశ్చికం :

అన్నివైపులా మంచే జరుగుతుంది. నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంది. సోదర వర్గం సహకరిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు. విద్యార్థులు కష్టపడాలి. ఉద్యోగులకు కీలక వర్తమానం, విశేష లాభం ఉన్నాయి.


ధనుస్సు :

అనుకున్నవి జరగవు. ఆర్థిక లావాదేవీలు ముందుకు సాగవు. ద్వితీయ వివాహ ప్రయత్నాలకు ఆటంకాలుంటాయి. అకారణ విరోధాలుంటాయి. మాటతూలకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.


మకరం :

ఉల్లాసంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తుల చిక్కులు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ప్రశంసలు లభిస్తాయి.


కుంభం :

అప్రమత్తంగా ఉండాలి. కార్యవైఫల్యం వల్ల మనసు కలతబారుతుంది. బద్ధకాన్ని వదలండి. తల్లి పుట్టింటికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. వ్యాపారులు గట్టి పోటీని ఎదుర్కొంటారు. వేళకు భోజనం ఉండదు.


మీనం :

కార్యాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆత్మీయులను కలుస్తారు. సంతాన వ్యవహరాలు తృప్తినిస్తాయి. ఇంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories