రాశిఫలం..01-04-2025 (మంగళవారం)

రాశిఫలం..01-04-2025 (మంగళవారం)
x
Highlights

శ్రీరాశిఫలం01-04-2025 (మంగళవారం)కాలాదులు: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయనం, వసంత రుతువు, శుక్ల పక్షంతిధి : చవితి అర్ధరాత్రి దాటాక...

శ్రీ

రాశిఫలం

01-04-2025 (మంగళవారం)

కాలాదులు: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయనం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : చవితి అర్ధరాత్రి దాటాక తె.వా.గం.2.32 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: భరణి ఉదయం గం.11.06 ని.ల వరకు

అమృతఘడియలు: ఉదయం గం.6.50 నుంచి గం.8.16 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.9.58 ని.ల నుంచి గం.11.25 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.41 ని.ల నుంచి గం.9.31 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.15 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.01 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.11 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.39 ని.లకు

మేషం :

ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. పురోగతికి అవసరమైన దారులు కనిపిస్తాయి. సహచరులు తోడుగా నిలుస్తారు. అంతులేని ఆనందాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. విందులో పాల్గొంటారు.

వృషభం :

సోమరితనం పనికిరాదు. చేపట్టిన కార్యాలు సఫలం అయ్యేందుకు శ్రమించాల్సి వుంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది.మిత్రుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం వద్దు.

మిథునం :

లాభదాయకంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ సంతోషాన్ని పొందుతారు. ఇష్టమైన వారితో వినోదంగా గడుపుతారు.

కర్కాటకం:

ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలమవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. అవకాశాలు అందివస్తాయి. తెలివైన నిర్ణయం తీసుకోవాలి. స్థిరత్వాన్ని సాధిస్తారు. డబ్బు ఆదా అవుతుంది.

సింహం :

గురు సమానులను కలుస్తారు. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణనిస్తాయి. సంతానంతో విభేదిస్తారు. ఉద్యోగులు బాధ్యతగా మెలగాలి. త్వరగా అలసిపోతారు. న్యాయపరమైన అంశాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కన్య :

తగాదాలకు ఆస్కారముంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం మంచిది కాదు. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. జీర్ణ సమస్య ఉంటుంది.

తుల :

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధువులను కలుస్తారు.

వృశ్చికం :

లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. బలహీనతలను అధిగమిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వివాదం పరిష్కారమవుతుంది. మనశ్శాంతిని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది

ధనుస్సు :

విరోధం వృద్ధి చెందుతుంది. అతి తెలివితో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మిత్రులు, సన్నిహితులను సంప్రదించండి. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు దుఃఖాన్ని మిగుల్చుతాయి.

మకరం :

బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

కుంభం :

ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. అన్నివైపులా శుభంగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందపరుస్తాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సోదరులతో సఖ్యత వృద్ధి చెందుతుంది.

మీనం :

నోటిదురుసు వల్ల చిక్కుల్లో పడే సూచన ఉంది. బ్యాంకు లావాదేవీలు ప్రయోజనాన్నివ్వవు. కుటుంబ సభ్యుల తీరు చికాకు పరుస్తుంది. రెండో పెళ్లి ప్రయత్నం వాయిదా పడుతుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. జాగ్రత్త.

శుభమస్తు

Show Full Article
Print Article
Next Story
More Stories