Chandra Grahanam 2026: మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!


Chandra Grahanam 2026: మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
Chandra Grahanam 2026: మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం! సింహరాశిలో సంభవిస్తున్న ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి గండం? గ్రహణ సమయం, సూతక కాలం మరియు పాటించాల్సిన నియమాల పూర్తి వివరాలు.
Chandra Grahanam 2026: ఖగోళంలో అరుదైన మార్పు చోటుచేసుకోనుంది. వచ్చే నెల మార్చి 3వ తేదీ, మంగళవారం నాడు 'సంపూర్ణ చంద్రగ్రహణం' సంభవించనుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడే చివరి గ్రహణం ఇదే కావడం విశేషం. ఫాల్గుణ శుక్ల పౌర్ణమి నాడు కేతు గ్రస్తోదయ గ్రహణంగా ఇది ఏర్పడనుంది.
భారతదేశంలో ప్రభావం:
ఈ గ్రహణం సంపూర్ణమైనదే అయినప్పటికీ, భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపిస్తుంది. మన దేశంలో సాయంత్రం 6:20 గంటలకు చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. వాస్తవానికి ఈ గ్రహణ ప్రక్రియ మధ్యాహ్నం 3:21 గంటలకే ప్రారంభమై మొత్తం 3 గంటల 27 నిమిషాల పాటు కొనసాగుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
సింహరాశిలో గ్రహణం.. ఆ రాశులపై ప్రభావం:
దృక్ సిద్ధాంతం ప్రకారం, ఈ చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రం, సింహరాశిలో సంభవించనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు:
సింహరాశి: ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడకపోవడం శ్రేయస్కరం.
ఇతర రాశులు: మేషం, మీనం, ధనుస్సు, వృశ్చికం, కన్య, కుంభం, కర్కాటక, మకర రాశులపై కూడా ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ రాశుల వారు గ్రహణ శాంతులు చేయించుకోవడం ఉత్తమం.
పాటించాల్సిన నియమాలు:
♦ గ్రహణం పాక్షికంగా కనిపించినప్పటికీ సూతక కాలం, ఆలయాల మూసివేత వంటి నియమాలు వర్తిస్తాయి.
♦ సనాతన ధర్మాన్ని పాటించే వారు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజన కార్యక్రమాలు ముగించాలి.
♦ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి.
♦ గ్రహణం విడిచిన తర్వాత పవిత్ర స్నానాలు ఆచరించి, ఇళ్లను శుద్ధి చేసుకోవాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



