Ugadi 2025: శ్రీ విశ్వవసునామ సంవత్సరం.. కర్కాటక రాశి పూర్తి ఫలితాలు..!

Ugadi 2025: శ్రీ విశ్వవసునామ సంవత్సరం.. కర్కాటక రాశి పూర్తి ఫలితాలు..!
x

Ugadi 2025: శ్రీ విశ్వవసునామ సంవత్సరం.. కర్కాటక రాశి పూర్తి ఫలితాలు..!

Highlights

ఆదాయం- 8వ్యయం- 2రాజపూజ్యత- 7అవమానం- 3Ugadi 2025 Cancer Horoscope: గురు, శని బలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని...

ఆదాయం- 8

వ్యయం- 2

రాజపూజ్యత- 7

అవమానం- 3

Ugadi 2025 Cancer Horoscope: గురు, శని బలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల వారూ, అన్నింటా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సామర్థ్యాన్ని చూపి అడ్డంకులను తొలగించుకుంటారు. చాలా కాలంగా తీరని సమస్యలు, తగాదాలు, ఆస్తి వ్యవహారాలు ఈ ఏడాది అనుకూలించే సూచనలున్నాయి. ఆర్థికంగా కాస్త మెరుగ్గానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ పట్టుదలతో పనిచేయాల్సి వుంటుంది. అనుకోని ఇబ్బందులు, చికాకుల వల్ల మనోస్థైర్యం తగ్గే సూచనలూ ఉన్నాయి. అయినా నిబ్బరాన్ని కోల్పోరాదు.

ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు, వృథా ప్రయాణాలు వేదనకు గురి చేస్తాయి.

కుటుంబ అవసరాలను తీర్చేందుకు శ్రమిస్తారు. ఆర్థిక ఒడుదుడుకులను గట్టెక్కేందుకు కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మాట పడాల్సి వస్తుంది. గతంలో ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి ఇబ్బంది పడతారు. భార్య తరఫు వారి ద్వారా సంతోషకరమైన వర్తమానం అందుతుంది. సంతానం పురోభివృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలుంటాయి. ముఖ్యంగా కడుపునకు సంబంధించిన అనారోగ్యాలపై తక్షణం వైద్యులను సంప్రదించడం మంచిది.

గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత.. అంటే అక్టోబర్ నెలలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతోషాన్ని కలిగించే శుభవార్తలను వింటారు. ఆ కాలంలో ప్రయత్నించిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ, ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. జరుగుతున్న పరిణామాలతో జీవితంపై ఆశ, ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి.

వృత్తి, ఉద్యోగాల్లోని వారికి మానసిక ఒత్తిడి, అనుకోని ఆందోళన బాధిస్తాయి. ఆశించిన ఇంక్రిమెంట్లు, కోరుకున్న చోటికి బదిలీలు లభించే అవకాశం తక్కువగా ఉంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగాలి. తొందరపాటు, నోటి దురుసు కారణంగా, ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ప్రభుత్వ రంగంలోని వారికి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. వీరు పై అధికారుల గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులు విపరీతమైన శ్రమానంతరమే తగిన ఫలితాలను పొందుతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి.

వ్యాపార రంగంలోని వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆశించిన లాభాలు ఉన్నప్పటికీ, పోటీ తీవ్రంగా ఉండి, మానసిక ఒత్తిడి అధికమవుతుంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేసే వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థికంగా చక్కటి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి అనుకూలంగా ఉన్నట్లే కనిపించినా, అదృష్ట భంగం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపార విస్తరణ ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. రియల్టర్లు, స్టాక్ మార్కెట్ వర్గాలు ఆచితూచి వ్యవహరించాలి.

రాజకీయ రంగాల్లోని వారికి మధ్యమ ఫలితాలుంటాయి. ప్రజాజీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. గతంలో చేసిన పనులు, ప్రస్తుత స్వయంకృతాపరాధం వల్ల అవమానాలకు గురయ్యే వీలుంది. పదవులు ఆశించే వారికి నిరాశ తప్పదు. బాధ్యతల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.

విద్యార్థులు, రెగ్యులర్ పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయం కోసం విశేషంగా శ్రమించాల్సి ఉంటుంది. ర్యాంకుల సాధన అంత సులువైన సంగతేమీ కాదని అర్థమవుతుంది. అనునిత్యం క్రమశిక్షణతో, చక్కటి ప్రణాళికలతో చదివినప్పుడే, కోరుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఏకాగ్రత దెబ్బతినే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. విదేశీ విద్యా ప్రయత్నాలకు అంత అనుకూలంగా లేదు.

ఈ రాశివారు నిత్యం దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. తరచూ నవగ్రహ శాంతిని చేయించుకోవడం వల్ల గోచార గ్రహ దోషాలు తొలగిపోయే వీలుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories