Kitchen Vastu Tips: వంటగదిలో ఈ పనులు చేస్తే.. అప్పులు వెంటాడుతాయి

Kitchen Vastu Tips
x

Kitchen Vastu Tips: వంటగదిలో ఈ పనులు చేస్తే.. అప్పులు వెంటాడుతాయి

Highlights

Kitchen Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, మన ఇల్లు ఎలా ఉండాలి? ఏ రూమ్ ఏ దిశలో నిర్మించాలి? అనే విషయంపై కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పవని వాస్త్ర శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Kitchen Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, మన ఇల్లు ఎలా ఉండాలి? ఏ రూమ్ ఏ దిశలో నిర్మించాలి? అనే విషయంపై కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పవని వాస్త్ర శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది శుభ్రంగా ఉండకపోతే మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు చెబుతోంది. వంటగదిలో ఈ పనులు చేస్తే అప్పులు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చెప్పులు వేసుకుని..

వంటగది పవిత్రమైన స్థలం. ఇందులో నీరు, నిప్పు, భూమి, గాలి ఉంటాయి. కాబట్టి, వంటగదిలోకి చెప్పులు వేసుకుని వెళ్లడం మంచిది కాదు. అలా వేసుకోని వెళ్లడాన్ని అపవిత్రంగా పరిగణిస్తారు. ఇది డబ్బు సమస్యలు తీసుకురావడమే కాక, మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది. కాబట్టి, ఇంట్లోకి చెప్పులు కానీ, బూట్లు కానీ వేసుకోని వెళ్లడం మంచిది కాదు.

చెత్త బుట్ట పెట్టకండి

చెత్త బుట్ట వంటగదిలో ఉంచడం వాస్తూ ప్రకారం మంచిది కాదు. ఇది దరిద్రానికి సూచనగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, చెత్తను ఎప్పుడూ వంటగది బయట ఉంచాలి. లేకపోతే మీరు ఎప్పుడూ ఆర్ధిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

బాత్రూమ్ ఉండకూడదు

వంటగది ముందు బాత్రూమ్ నిర్మించడం వాస్తు దోషానికి కారణం అవుతుంది. ఇది ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటివి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

మురికిపాత్రలను వదిలేయకండి

వండిన తరువాత పాత్రలను వెంటనే శుభ్రం చేయకపోతే అవి నెగెటివ్ శక్తిని తీసుకువస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో మురికిపాత్రలు అలానే ఉంచడం వల్ల డబ్బు నిలవదు. ఎప్పుడూ ఖర్చుల మధ్యే జీవితం గడుస్తుంది.

ఈ చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేస్తే మన జీవితం అంతా అప్పుల పాలవుతుంది. వంటగదిని శుభ్రంగా, పద్ధతిగా ఉంచితే డబ్బు, శాంతి రెండూ మీ జీవితంలో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories