Vastu Tips: ఈ 5 పనులను క్రమం తప్పకుండా చేస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం

Vastu Tips
x

Vastu Tips: ఈ 5 పనులను క్రమం తప్పకుండా చేస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం

Highlights

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, రోజువారీ జీవితంలో కొన్ని పనులు చేయడం ద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, రోజువారీ జీవితంలో కొన్ని పనులు చేయడం ద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా ఈ 5 పనులను చేస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సును ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సంపద కోసం వాస్తు టిప్స్

*వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు సంబంధిత సమస్యలకు ప్యాంటు, సల్వార్ లేదా పైజామాను ఎప్పుడు కూడా కుడి పాదం ముందుగా ధరించాలి. ఇలా చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి సంపద పెరుగుతుందని నమ్ముతారు.

*వాస్తు శాస్త్రం ప్రకారం, బూట్లు కూడా ముందుగా కుడి పాదంకు వేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని నమ్ముతారు.

*ఒక పాదానికి ఉన్న చెప్పును మరొక పాదానికి ఉన్న చెప్పుతో తీయకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

*ఆర్థిక లాభం, ఆనందం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం, చొక్కా బటన్లను ఎప్పుడూ కూడా కింది నుండి పైకి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంటారు.

*వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక శ్రేయస్సు, జీవితంలో పురోగతి కోసం గురువారం నీటిలో పసుపు కలిపి స్నానం చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories