Weekly Horoscope 01 To 07 September 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 01 To 07 September 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
( 01-07-2024 నుంచి 07-09-2024 వరకు )
మేషం
అనుకూల ఫలితాలుంటాయి. అడపాదడపా కొన్ని ఆటంకాలు వచ్చినా, పనులు శుభప్రదంగానే పూర్తవుతాయి. బలహీనతలను అధిగమిస్తారు. ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారు. మిత్రులు సహకరిస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో మానసిక చికాకులు తొలగిసోతాయి. ఉద్యోగస్తులు తగిన గుర్తింపును పొందుతారు. పోటీదారులను జయిస్తారు. ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. న్యాయ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృషభం
కార్యసాధనకు బాగా కష్టపడాల్సి వస్తుంది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. స్థిర చిత్తంతో ముందుకు సాగాలి. భూ సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. రహస్యాలు బయటపెట్టకండి. అనవసర విశ్లేషణలు మానండి. విద్యాసంబంధ వ్యవహారాలు సజావుగా సాగవు. అవమానాలు గోచరిస్తున్నాయి. సొంత మేధస్సు పని చేయదు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల తోడ్పాటుతో సమస్యను పరిష్కరిస్తారు.
మిథునం
ఆటంకాలను దాటేస్తారు. సోదరులు చేయూతను అందిస్తారు. ఆత్మీయులతో కీలక సమాచారాన్ని పంచుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధను పెంచండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. రియల్ రంగంలోని వారికి మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. వాహన సంబంధ సమస్యలు ఉంటాయి. కీలక నిర్ణయాల్లో ఆప్తమిత్రుడి సూచనలను పాటించండి. నాయకత్వ పటిమకు ప్రశంసలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కర్కాటకం
పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనకరంగా ఉండవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కీలక సమయంలో సోదరుల సూచనలు ఉపకరిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్య సమాచారం నిరాశ పరుస్తుంది. ఆస్తి వ్యవహారాలు చిక్కుల్లో పడతాయి. కుటుంబ సభ్యుత తీరు ఆవేదనను కలిగిస్తుంది. ముందుచూపు లేమి వల్ల అవమానాలు ఎదుర్కొంటారు. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సత్ఫలితం ఉంటుంది.
సింహం
అనువైన ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉన్నత స్థానానికి చేరే ప్రయత్నం ఫలిస్తుంది. బాల్యస్మృతులు ఆనందపరుస్తాయి. సోదరులు తోడుగా నిలుస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. విద్యా వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. నాయకత్వ పటిమకు ప్రశంసలు లభిస్తాయి. అనవసర జోక్యం, నోటి దురుసు మంచిది కాదు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదృష్టం తోడుంటుంది.
కన్య
ప్రతికూలతలు పెరుగుతాయి. స్థిరచిత్తంతో కార్యాలను సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సున్నిత మనస్తత్వం ఇబ్బంది పెడుతుంది. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. కీలక తరుణంలో అదృష్టం తోడుంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అనవసర వాగ్వాదాల వల్ల మిత్రులతో విరోధం గోచరిస్తోంది. కీలక నిర్ణయాల్లో ముందుచూపు అవసరం. విడాకులు, రెండో పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి.
తుల
ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక చిక్కులేవీ ఉండవు. బయటి వారి నుంచి కూడా సహకారం లభిస్తుంది. గృహావసరాలను తీరుస్తారు. సంతాన సంబంధ విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. విందుల్లో పాల్గొంటారు. విదేశీ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బందులొస్తాయి. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేయండి.
వృశ్చికం
శుభప్రదంగా ఉంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. ప్రత్యర్థులు పోటీల నుంచి వైదొలగుతారు. ఆర్థిక ప్రయోజనం సిద్ధిస్తుంది. కొత్త స్నేహితుల మూలంగా లబ్దిని పొందుతారు. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. బంధుమిత్రుల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు
అత్యంత యోగదాయకంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సంతాన సంబంధ శుభ కార్యాల గురించి చర్చిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దల అభిమానాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కోర్టు లావాదేవీల్లో నిర్లక్ష్యం వద్దు. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం గోచరిస్తోంది.
మకరం
ఒడుదుడుకులను స్థిరచిత్తంతో అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొద్దిపాటి కష్టంతో అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతస్థితికి చేరేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అపోహలు తొలగిపోతాయి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండండి. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
కీలక వ్యవహారాలను వారం మొదట్లోనే చేపట్టండి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. బంధువులతో విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. మనశ్శాంతిని పొందుతారు. విజ్ఞానాన్ని మెరుగు పరచే ప్రయత్నాలకు అనుకూలం. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. సొంతంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అపోహలు ఆత్మీయులను దూరం చేసే వీలుంది. ఓటమి భయం వెంటాడుతుంది. గురువుల మార్గనిర్దేశనం ఉపకరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం
విజయవంతంగా గడుస్తుంది. ధనలాభం ఉంది. అపార్థాలు తొలగి కుటుంబ బంధాలు దృఢమవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన సమయం. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులను కలుస్తారు. వారాంతంలో వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. వారసత్వపు వ్యవహారాల్లో జాగ్రత్త.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire