Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 9 నుంచి 15 వరకూ రాశిఫలాలు

Weekly Horoscope for June 9th to 15th June 2024
x

Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 9 నుంచి 15 వరకూ రాశిఫలాలు

Highlights

Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 9 నుంచి 15 వరకూ రాశిఫలాలు

(09-06-2024 నుంచి 15-06-2024 వరకు)

మేషం : విపరీతమైన శ్రమానంతరం కార్యాలు ఫలప్రదం అవుతాయి. అవసరమైన వేళ బంధుమిత్రులు తోడ్పడతారు. బుద్ధి స్థిరంగా ఉండదు. ఆత్మీయులతోనే గొడవలొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. విలువైన వస్తువులు చోరీకి గురయ్యే సూచన ఉంది. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వాత సంబంధ సమస్యలు వస్తాయి. సంతానం శైలి ఆందోళనకు గురి చేస్తుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలను వాయిదా వేయండి. వారాంతానికి పరిస్థితి కాస్త మెరుగవుతుంది. మల్లికార్జున స్వామిని పూజించండి.

వృషభం : కీలకమైన పనులను వారం ప్రారంభంలోనే చేపట్టండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. కొత్త వస్తువులు కొంటారు. బుద్ధి నిలకడ లోపించడం వల్ల బంధువులతోనే విరోధం గోచరిస్తోంది. అత్యవసర సమయాల్లో సోదరులు తోడుగా నిలుస్తారు. కీలక కార్యాల్లో సొంత తెలివి తేటలు పనికిరావు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు తప్పవు. తల్లి ఆరోగ్యం కలవర పెడుతుంది. నిరాశను వదిలి పెట్టండి. బద్ధకాన్ని విడిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది.

మిథునం : ప్రతి పనికీ ఆటంకాలు వస్తుంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం మానేయండి. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. మాట నిలుపుకోని కారణంగా నిందలు భరించాల్సి వుంటుంది. వ్యవహార నష్టాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక సమస్య ఉండదు కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటి స్థితిగతులు మెరుగ్గానే ఉంటాయి. మిత్రులు, సోదరులు తోడుగా నిలుస్తారు. సాంత్వన కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి,.

కర్కాటకం: కార్యజయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహోపకరణాలను కొంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మేలిమి కాలం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అన్ని వర్గాల వారూ ప్రశంసలను పొందుతారు. వాహనయోగం ఉంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. ఖర్చులు అదుపు చేసుకోండి. ఇతరుల వ్యవహారాల్లో పొరపాటున కూడా తలదూర్చకండి. ఆస్తి నష్టం గోచరిస్తోంది జాగ్రత్తగా వ్యవహరించండి. కీలక వేళల్లో అదృష్టం తోడవుతుంది.

సింహం: చేపట్టిన పనులు ఆశించిన రీతిలో సాగవు. శ్రమ అధికంగా ఉంటుంది. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బంధువుల నుంచి తగిన సహకారం లభించదు. దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. మిత్రులే విరోధులయ్యే సూచన ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. బద్ధకాన్ని వదిలి పెట్టండి. వారం మధ్యలో అదృష్టం తోడై కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. అంతులేని ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వృథా ప్రయాణాలు రద్దు చేసుకోండి.

కన్య: శుభప్రదంగా ఉంటుంది. కార్యాలు అనుకున్నట్లుగానే సాగుతాయి. ధనలాభం ఉంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ శుభ వార్తలు వింటారు. శుభ కార్యాల ప్రణాళికలు వేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. అవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు. విద్యార్థులు, ఉద్యోగులకు శుభ తరుణం. పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు.

తుల: పట్టింది బంగారంలా ఉంటుంది. అన్ని పనులూ అనుకున్నట్లే సాగుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. ఆర్థిక చికాకులు తొలగుతాయి. అధికారుల ఆదరాభిమనాలను పొందుతారు. చక్కటి అవకాశాలు వస్తాయి. కీలక బాధ్యతలను చేపడతారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగండి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చికం: ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా అనిపించినా, అభీష్టాలు నెరవేరతాయి. యత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. స్థిర చిత్తం అలవాటవుతుంది. అధికారులు మార్గనిర్దేశనం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అధికార వృద్ధి ఉంది. ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రుణ విముక్తికి చేసే ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. నూతన స్నేహితుల వల్ల లాభాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన సమయమిది.

ధనుస్సు: పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. చెప్పుడు మాటలు వినకండి. ఇతరులపై చెడు అభిప్రాయాలు స్థిరపరచుకోకండి. ఆత్మవిశ్వాసం, స్థిర చిత్తంతో చేసే పనుల్లో విజయం మీ సొంతమవుతుంది. అధికారులు, మీ చిత్తశుద్ధిని గుర్తిస్తారు. తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలను చేజార్చుకోకండి. ఒక్కోసారి ఇష్టం లేని పనులూ చేయాల్సి వస్తుంది. ఇంట్లో చిన్నపాటి కలతలు తలెత్తినా జీవిత భాగస్వామి తోడ్పాటుతో సరిచేస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. భవిష్యత్తు కోసం నూతన ప్రణాళికలను రూపొందిస్తారు.

మకరం: ఆటంకాల వల్ల పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆత్మీయుల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కాస్త చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలు చక్క దిద్దుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వేళకు భోజనం ఉండదు. తగాదాలు గోచరిస్తున్నాయి.. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం మానండి. వ్యాధులు తిరగబెట్టే సూచన ఉంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మానసిక ఉద్రేకాన్ని, వృథా ఖర్చులను అదుపు చేయండి. ఆంజనేయ స్వామిని పూజించండి.

కుంభం: చేపట్టిన కార్యాలన్నీ జయప్రదంగా సాగుతాయి. అభీష్టం ఒక్కొక్కటిగా నెరవేరుతుంది. పూర్వ వైభవం దిశగా సాగుతారు. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి ఉంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక, శారీరక ప్రశాంతతను పొందుతారు. ముఖ పరిచయస్తులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. వారం చివరలో అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. అప్రమత్తంగా ఉండండి.

మీనం: అభీష్టాలు నెరవేరతాయి. ఆటంకాలను అధిగమించి కార్యాలను సాధించుకుంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు పడతాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు, జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు అనువైన సమయమిది. అందరితోనూ బంధాలు దృఢపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు తీసుకోండి. విలువైన వస్తువులు జాగ్రత్త.

Show Full Article
Print Article
Next Story
More Stories