Weekly Horoscope 23 To 29 June 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

Weekly Horoscope in Telugu 23 To 29 June 2024
x

Weekly Horoscope 23 To 29 June 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

Highlights

Weekly Horoscope 23 To 29 June 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

వారఫలం (23-06-2024 నుంచి 29-06-2024 వరకు)

మేషం: ఈవారం యోగదాయకంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయి. ఆర్థిక అవసరాలు తీరతాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అభీష్టసాధనలో అదృష్టం తోడుగా ఉంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఖర్చులు తగ్గించండి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంటి వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. పరిచయస్తుల సహకారం వల్ల కీలక వ్యవహారం సఫలమవుతుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. పురోభివృద్ధికి సంబంధించి కీలక అవకాశం అందివస్తుంది. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కుదుటపడతాయి. విద్యార్థులు ప్రతిభను కనబరుస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. మానసికశాంతిని పొందుతారు.

మిథునం: ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయి. సర్వత్రా అనుకూలతలే ఉంటాయి. ఉద్యోగులకు మేలిమి కాలమిది. అధికారుల ఆదరాన్ని పొందుతారు. ఎదిగేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కొత్త బాధ్యతలను చేపడతారు. ఇంటి పరిస్థితులు సవ్యంగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక చికాకులు తొలగుతాయి. అప్పుతీర్చే ప్రయ్నతాలు అనుకూలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: కొన్ని ఇబ్బందులు ఎదురైనా సంకల్పించిన పనుల్లో విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగి పోతాయి. చాకచక్యంతో శత్రువులను జయిస్తారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. అపోహలకు ఆస్కారం ఇవ్వకండి. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఇంటికి దూరంగా గడిపే సూచన ఉంది. ఆత్మవిశ్వాసం వదలకండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. బలహీనతలను బయటపెట్టకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

సింహం: ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించండి. ఏమరుపాటుగా ఉంటే దెబ్బతింటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనుకున్న సమయంలో ఆశించిన సదుపాయాలు సమకూరవు. మనోద్రేకాన్ని అదుపు చేసుకోండి. చిన్నపాటి వ్యవహారాలకే అలసట వస్తుంది. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములకు మేలు జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. పైత్య సంబంధ సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య: అభీష్టం నెరవేరుతుంది. సంకల్పించిన కార్యాలు విజయవంతం అవుతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. నూతన వస్తువులను కొంటారు. ఇతరులతో సంబంధాలు గట్టి పడతాయి. బంధుమిత్రులను కలుస్తారు. వినోదంగా గడుపుతారు. నైపుణ్యాభివృద్ధికి అనుకూలం. చెప్పుడు మాటలు నమ్మకుండా విచక్షణతో నిర్ణయాలు తీసుకోకండి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరక పోవడం చికాకు పెడుతుంది. స్థిర చిత్తంతో ముందుకు సాగండి.

తుల: ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా ఉన్నా, కార్యాలు సఫలం అవుతాయి. పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తారు. ప్రయత్నాలకు బంధుమిత్రులు సహకరిస్తారు. శారీరక ఆనందాన్ని పొందుతారు. కీలక సందర్భంలో జీవిత భాగస్వామి సూచనలు బాగా ఉపకరిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనుకునేవారికి ఇది అనుకూలమైన సమయం. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో, మీ తెలివితేటలతో పాటే ఆత్మీయుల సూచనలను పాటించండి. మీ పట్టుదలకు పెద్దల ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం: కార్య సాఫల్యతకు బాగా శ్రమించాల్సి వుంటుంది. ఇంటా బయటా సమస్యలు చుట్టుముడతాయి. బద్ధకాన్ని వదిలి స్థిరచిత్తంతో కృషి చేస్తే ఫలితం ఉంటుంది. అయినవాళ్లే విరోధులుగా వ్యవహరించడం బాధను కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. సంతానం శైలి చికాకు పెడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మీయ మిత్రుల సహకారం గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కిస్తుంది. వృథాఖర్చులు తగ్గించుకోవడం మంచిది. విలువైన వస్తువు దొంగతనమయ్యే సూచన ఉంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు: కీలక వ్యవహారాలను వారం మొదట్లోనే చేపట్టండి. స్వల్పంగానైనా ప్రయోజనం చేకూరుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అడ్డంకులను అధిగమిస్తూ, ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు కృషి చేయండి. ఆత్మీయులతో సంభాషణ నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. తల్లి ఆరోగ్యం కలవర పెడుతుంది. భూసంబంధ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. నష్టాలు, అవమానాలు విచారాన్ని కలిగిస్తాయి. సోదరుల తోడ్పాటుతో కీలక వ్యవహారం నుంచి గట్టెక్కుతారు. అవసరమైన వేళ మిత్రుల సూచనలను పాటించండి.

మకరం: కార్యాలు అనుకున్న స్థాయిలో ముందుకు సాగవు. అనవసర భేషజాలకు వెళ్లకండి. ఆర్థిక స్థితిగతులను బట్టి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఎవరిపైనా మాట తూలకండి. పర్యవసానాలు కష్టాన్ని కలిగిస్తాయి. బుద్ధి నిలకడ లేని కారణంగా, బంధువులతో విరోధం కొని తెచ్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలూ చికాకు పెడతాయి. అవసరమైన వేళ మిత్రులు తోడుగా ఉంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. కంటి సంబంధ సమస్యలు నిర్లక్ష్యం చేయకండి.

కుంభం: శుభప్రదంగా ఉంటుంది. కార్యాలు, వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. అవసర వేళల్లో సోదరులు తోడు నిలుస్తారు. చాలాకాలంగా ఎదురు చూస్తోన్న వర్తమానం అందుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దగ్గరి ప్రయాణాలు యోగిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మేలిమి ఫలితాలుంటాయి. ఇతరుల వల్ల సమస్యలుంటాయి. ఎవరి వ్యవహారంలోనూ జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం బావుంటుంది.

మీనం: అననుకూలతలు ఉంటాయి. బంధువులతోనే వైరం తలెత్తుతుంది. నిందలు, అవమానాలు ఎదురవుతాయి. సర్దుకుని పోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కీలక సమయంలో అదృష్టం తోడవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉల్లాసాన్ని కలిగిస్తుంది. మీ పనితీరుతో పెద్దల ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రుల వైద్యానికి ఖర్చు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories