Weekly Horoscope in Telugu July 28 To August 3rd, 2024: వారఫలం (జులై 28-ఆగస్టు 3)

Weekly Horoscope in Telugu 28 July To 03 August 2024: ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి రాశిఫలం ఉంటుందంటే.

P Vijay Kumar Astrologer
Updated on: 28 July 2024 6:01 AM IST
Weekly Horoscope in Telugu July 28 To August  3rd, 2024: వారఫలం (జులై 28-ఆగస్టు 3)
X

వారఫలం (28-07-2024 నుంచి 03-08-2024 వరకు)

మేషం

అనువైన కాలం నడుస్తోంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు కాస్త చికాకు పెట్టినా, ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. శుభ వర్తమానం అందుతుంది. కీలక సందర్భంలో మీ ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సోదర వర్గం తోడ్పాటు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. అదృష్టం అండగా ఉంటుంది. వారమంతా ఉల్లాసంగా గడుపుతారు.

వృషభం

కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. అవసరానికి ఎవరూ అండగా నిలవరు. మానసిక దిగులు ఆవరిస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. కాబట్టి, చెప్పుడు మాటలు వినకండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. కుటుంబంలో కూడా స్వల్ప చికాకులు గోచరిస్తున్నాయి. వేళకు సరైన భోజనం ఉండదు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి ఉంటుంది. అదృష్టం సహకరించడంతో కీలక సమస్య నుంచి బయటపడతారు. వృథా ప్రయాణాలు వద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం

అన్నీ అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. గృహోపకరణాలను కొంటారు. వాహన యోగం ఉంది. గౌరవం పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇతరులూ మీకు అండగా ఉంటారు. మీ ఆకాంక్షలు నెరవేరతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి.

కర్కాటకం

స్థిర చిత్తంతో చేసే ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ధన సంబంధ చికాకులు తొలగిపోతాయి. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీకే విజయం లభిస్తుంది. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాల్లో ముందడుగు పడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి.

సింహం

ప్రారంభంలో స్వల్ప ఒడుదుడుకులుగా ఉన్నా, కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శత్రుపీడ తొలగిపోతుంది. చక్కటి అవకాశాలు అందివస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అప్పులు తీర్చేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.

కన్య

బాగా శ్రమించాకే అభీష్టం నెరవేరుతుంది. చెప్పుడు మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, మేలిమి అవకాశాలు చేజారతాయి. ఆచితూచి అడుగులు వేయండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం కలవర పరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొనసాగించే పనులు సఫలం అవుతాయి. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కీర్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. సంతాన సంబంధ వ్యవహారం చికాకు పరుస్తుంది.

తుల

కీలకమైన కార్యాలను వారం మొదట్లోనే ప్రారంభించండి. అవసరానికి సరిపడినంత డబ్బే సమకూరుతుంది. అనవసర అపోహల కారణంగా వ్యవహారాలు చెడిపోతాయి. అనుకున్న సమాయానికి నిర్దేశిత సౌకర్యాలు సమకూరవు. తగాదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో.. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండండి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వారి కోసం ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందిస్తారు.

వృశ్చికం

చేపట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ధనలాభం ఉంది. బంధుమిత్రుల సహకారంతో శుభ ఫలితాలను పొందుతారు. వస్తు, వాహన యోగం ఉంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సూచనలు బాగా ఉపయోగ పడతాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. సొంతంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కీళ్లు, జీర్ణ, పైత్య సంబంధ ఆరోగ్య సమస్యలుంటాయి.

ధనుస్సు

ఆటంకాలను చాకచక్యంగా అధిగమిస్తారు. చేపట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల కన్నా, ఆత్మీయులను సూచనలను పాటించడం మేలు. జీవిత భాగస్వామితో సంప్రదింపులు పరిష్కారాన్ని చూపుతాయి. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన సమయమిది. బంధుమత్రుల తోడ్పాటు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

మకరం

మిశ్రమ ఫలితాలుంటాయి. విపరీతంగా శ్రమిస్తేనే పనులు సఫలం అవుతాయి. డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు కొంత చికాకుగా ఉంటాయి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. బద్ధకం వల్ల చిక్కుల్లో పడతారు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. బుద్ధి నిలకడగా ఉండదు. చెడు ఆలోచనలను కట్టిపెట్టండి. ఉద్యోగులు అధికారుల అండతో రాణిస్తారు. కీలక తరుణంలో మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. శత్రుపీడ క్రమంగా తగ్గుతుంది. అనుమానాలు వీడండి.

కుంభం

పనులు ఆశించిన రీతిలో సాగవు. ఆటంకాలు ఎక్కువవుతాయి. ధన సంబంధంగా చికాకు కలుగుతుంది. కీలక సమాచారం అందుకుంటారు. సోదర వర్గం తోడ్పాటునిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. స్థిరాస్తి విక్రయ ప్రయత్నాలు అనుకూలించవు. వృథా ఖర్చులు తగ్గించాలి. బంధువులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కీలక సమయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశపు ఆలోచనలను అదుపు చేసుకోండి. వాత సంబంధ సమస్యలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

మీనం

చేపట్టిన పనులు సజావుగా సాగవు. వ్యవహారాల్లో ఆశించిన లక్ష్యం నెరవేరదు. ధన సంబంధ అంశాలు చికాకు పెడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ముఖ్యమైన సమాచారం సంతోషాన్నిస్తుంది. మీ ధైర్యసాహసాలకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. మిత్రులు తోడ్పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబంలో చికాకులు వస్తాయి. వేళకు భోజనం ఉండదు. వైద్య చికిత్సల కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story