Zodiac Compatibility: రాశులను తెలుసుకుని ప్రేమిస్తున్న యువత.. ఇదేం విడ్డూరం మావా!

Zodiac Compatibility
x

Zodiac Compatibility: రాశులను తెలుసుకుని ప్రేమిస్తున్న యువత.. ఇదేం విడ్డూరం మావా!

Highlights

Zodiac Compatibility: భారత యువతలో 51% మంది రాశుల ఆధారంగా రిలేషన్‌షిప్స్‌ మెయింటేయిన్ చేస్తున్నారట!

Zodiac Compatibility: ఇప్పటి యువత డేటింగ్‌కు ముందు తమ భావోద్వేగాలకు అర్థం చెప్పేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. వాటిలో జ్యోతిష్యం, ముఖ్యంగా రాశి కలిసిరావడం అనే భావన ఎంతో ప్రాధాన్యం సంపాదించుకుంది. ఒకప్పుడు పెద్దల మధ్య మాత్రమే ఉండే జాతకాలు చూసి పెళ్లిళ్లు నిశ్చయించే పద్ధతి, ఇప్పుడు మోడరన్ డేటింగ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని 51 శాతం సింగిల్స్ తమకు ఆకర్షణ కలిగే వ్యక్తుల రాశిని ప్రధానంగా పరిగణిస్తున్నారు. ఇక 27 శాతం మందికి ఇది ముఖ్యమే కాని, నిర్ణయాత్మకంగా అయితే ఉండదని భావిస్తున్నారు.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 'నీ రాశి ఏంటి?' అనే ప్రశ్న ఇప్పుడు చిన్న సంభాషణగా కాకుండా సంబంధాలపై ప్రభావం చూపే అంశంగా మారింది. జ్యోతిష్యానికి వేద కాలంనుంచి భారత సంస్కృతిలో ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు మోడరన్ రిలేషన్షిప్స్‌లో కొత్త దిశగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటి జనరేషన్ డేటింగ్‌ను తేలికగా తీసుకోవడం లేదు. విఫలమైన సంబంధాలు, విడాకులు చూసిన తరవాత, ఎక్కువ మంది యువత సంబంధాల్లో తాము చేసిన ఎంపికలపై భద్రత కోరుతున్నారు.

అలాగే సోషల్ మీడియాలో జ్యోతిష్య సంబంధిత కంటెంట్ విపరీతంగా పెరగడంతో, రాశులు తెలుసుకోవడం, జాతకం చూడడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కొన్ని మందికి ఇది సరదా విషయంలో భాగమైపోతే, మరికొందరికి తమ భావోద్వేగాలకు అర్థం చెప్పుకునే మార్గమవుతోంది. వాస్తవానికి డేటింగ్ అనేది చాలా మందికి భయాన్ని కలిగించే విషయం. తిరస్కరణ, హార్ట్ బ్రేక్, నమ్మకం దెబ్బతినడం లాంటి అనేక భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అలాంటప్పుడు రాశులు ఒక భద్రతా చిహ్నంగా మారుతాయి. ఇది సరైన నిర్ణయం తీసుకున్నామనే భావన కలిగించే ఒక చిన్న ఆధారంగా పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories