Harley Davidson X440 Lineup 2025: సరికొత్తగా T వేరియెంట్.. ఏం మారిందో తెలుసా..?

Harley Davidson X440 Lineup 2025: సరికొత్తగా T వేరియెంట్.. ఏం మారిందో తెలుసా..?
x

Harley Davidson X440 Lineup 2025: సరికొత్తగా T వేరియెంట్.. ఏం మారిందో తెలుసా..?

Highlights

హార్లే డేవిడ్‌సన్‌, 2025 కోసం తన X440 లైనప్‌ను రిఫ్రెష్‌ చేస్తూ కొన్ని కీలక మార్పులు చేసింది.

Harley Davidson X440 Lineup 2025: హార్లే డేవిడ్‌సన్‌, 2025 కోసం తన X440 లైనప్‌ను రిఫ్రెష్‌ చేస్తూ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ తెచ్చుకున్న ఈ మిడ్‌-సైజ్‌ రెట్రో స్ట్రీట్‌ మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు మరింత అప్‌డేటెడ్‌గా, మరిన్ని విభిన్నమైన వేరియెంట్లతో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా, Denim వేరియెంట్‌ను కంప్లీట్‌గా తీసేయడం, కొత్తగా T‌ వేరియంట్‌ని ఫ్లాగ్‌షిప్‌గా తీసుకురావడం పెద్ద అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు.

2025 లైనప్‌లో ఇప్పుడు మూడు వేరియెంట్లు మాత్రమే ఉన్నాయి, అవి - Vivid, S & కొత్తగా వచ్చిన T. డెనిమ్‌ వేరియెంట్‌ను తీసేయడంతో, ఎంట్రీ-లెవల్‌ ఆప్షన్‌గా ఇప్పుడు Vivid నిలిచింది. అదనంగా, Vivid & S వేరియెంట్ల ధరలను ₹25,000 తగ్గించడం కూడా కస్టమర్లకు మంచి బెనిఫిట్‌. ఈ ధర తగ్గింపు వల్ల కొత్త T వేరియెంట్‌ పర్ఫెక్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ పొజిషన్‌లోకి వచ్చింది.

ఈ మూడు వేరియెంట్లలోనూ (Vivid, S & T) ఒకే ఇంజిన్‌ - 440cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ - ఉంటుంది. ఇది 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 27hp పవర్‌, 38Nm టార్క్‌ ఇస్తుంది. సస్పెన్షన్‌, బ్రేకులు, ఫ్రేమ్‌ వంటి ప్రధాన భాగాలు మొత్తం లైనప్‌లో (అన్ని వేరియంట్లకూ) ఒకేలా ఉంటాయి, మార్పులు లేవు.

X440 Vivid – ఎంట్రీ లెవల్‌, కానీ ఆకర్షణీయమైన ఫీచర్లు

Vivid ధర రూ.2.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). డెనిమ్‌ వేరియెంట్‌లో ఉన్న spoke వీల్స్‌ స్థానంలో, ఇప్పుడు, ఈ వేరియెంట్‌లో అలాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు వచ్చాయి. ట్యాంక్‌పై స్టిక్కర్‌ డిజైన్‌ ఉండగా, Sలో ఉన్న 3D లోగో ఇక్కడ లేదు. 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నప్పటికీ, బ్లూటూత్‌ కనెక్టివిటీ మిస్సింగ్‌. కాబట్టి జియో-ఫెన్స్‌, రిమోట్‌ ఇమ్మోబిలైజర్‌, వెహికల్‌ డయాగ్నస్టిక్స్‌, ఫైండ్‌ మై బైక్‌, థెఫ్ట్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. అయినా, ఈ ధర వద్ద ఇది మంచి విలువైన వేరియెంట్‌గానే చెప్పుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories