2025 MG Astor: భారత్ మార్కెట్లోకి అప్‌డేటెడ్ ఎంజీ ఆస్టర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

2025 MG Astor
x

2025 MG Astor: భారత్ మార్కెట్లోకి అప్‌డేటెడ్ ఎంజీ ఆస్టర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Highlights

2025 MG Astor: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అప్‌డేటెడ్ 2025 ఆస్టర్ ఎస్‌యూవీని విడుదల చేసింది.

2025 MG Astor: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అప్‌డేటెడ్ 2025 ఆస్టర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇప్పుడు షైన్, సెలెక్ట్ వేరియంట్‌లలో కొత్త ఫీచర్లను చూడొచ్చు. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. అయితే కొన్ని వేరియంట్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2025 ఎంజీ ఆస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2025 ఎంజీ ఆస్టర్ అనేక రకాలైన స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ షైన్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, ఆరు స్పీకర్స్ ఉంటాయి. ఈ ఫీచర్లు ఇంతకుముందు సెలెక్ట్ వేరియంట్‌లో మాత్రమే ఉండేవి. ఆస్టర్ ప్రారంభ ధర రూ. 12.5 లక్షల నుండి మొదలవుతుంది.

మరోవైపు, సెలెక్ట్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ప్రీమియం ఐవరీ లెథెరెట్ సీట్లతో బెటర్ సేఫ్టీని అందిస్తుంది. ఈ ఫీచర్లు ఇంతకుముందు షార్ప్ ప్రో వేరియంట్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ అప్‌డేట్స్ మిడ్-రేంజ్ ట్రిమ్‌లకు మరింత విలాసవంతమైన అనుభూతిని అందిస్తాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.13.81 లక్షలుగా ఉంది.

ప్రస్తుతం 2025 ఎంజీ ఆస్టర్ ఎక్స్-షోరూమ్ ధర బేస్ స్ప్రింట్ మోడల్‌ ధర రూ. 9.99 లక్షల నుండి మొదలవుతుంది. టాప్-స్పెక్ సావీ ప్రో కోసం ధర రూ. 17.55 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు చేరుకుంటుంది.

ఎంజీ ఫీచర్లలో 10.1-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్ అడ్జస్టబుల్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రయాణికుల భద్రతపై కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.

సేఫ్టీ పరంగా ఎస్‌యూవీలో 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ORVMలు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, లేటెస్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, డిపార్చర్ అసిస్ట్, లేన్ కీపింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఆస్టర్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. కారు 1.5 లీటర్ నాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ 108 హార్స్ పవర్, 144 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVTతో వస్తుంది. అంతేకాకుండా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 138 హార్స్ పవర్, 220 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories