2025 Hyundai Venue: కొత్తగా హ్యుందాయ్ వెన్యూ.. సరికొత్త హైటెక్ ఫీచర్స్‌తో వచ్చేస్తోంది..!

2025 Hyundai Venue
x

2025 Hyundai Venue: కొత్తగా హ్యుందాయ్ వెన్యూ.. సరికొత్త హైటెక్ ఫీచర్స్‌తో వచ్చేస్తోంది..!

Highlights

2025 Hyundai Venue: హ్యుందాయ్ తన ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ కొత్త జనరేషన్ వేరియంట్‌ను లాంచ్ చేయనుంది.

2025 Hyundai Venue: హ్యుందాయ్ తన ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ కొత్త జనరేషన్ వేరియంట్‌ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని గురించి అధికారిక వివరాలను షేర్ చేసింది. కొత్త వెన్యూ నవంబర్ 4, 2025న భారతదేశంలో విడుదల కానుంది. ఈసారి, ఈ కారు డిజైన్‌లో మార్పులు మాత్రమే కాకుండా అనేక హై-టెక్ ఫీచర్లు కూడా ఉంటాయి. కంపెనీ ఇప్పుడు వెన్యూను మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మార్చడంపై దృష్టి సారించింది.

కొత్త వెన్యూలో ఇప్పుడు లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంటుందని హ్యుందాయ్ ధృవీకరించింది. గతంలో హై-ఎండ్ వాహనాలలో మాత్రమే కనిపించే ఈ ఫీచర్‌లో లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ డ్రైవింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా హైవే ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తాయి.

కొత్త వెన్యూ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో రెండు పెద్ద 12.3-అంగుళాల డిస్‌ప్లేలు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం. ఈ డిస్‌ప్లేలు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి.

వెన్యూ మోడల్ దక్షిణ కొరియాలో కనిపించింది. పెద్ద,వెడల్పు గల ఫ్రంట్ గ్రిల్, కొత్త పారామెట్రిక్ డిజైన్, సన్నని ఎల్ఈడీ డీఆర్‌లతో ఎల్ఈడీ హెడ్‌లైట్‌ ఉంది, ఇది ఆధునిక రూపాన్ని ఇస్తుంది. కొత్త బంపర్, పదునైన క్యారెక్టర్ లైన్లు ఎస్‌యూవీకి మరింత లుక్ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్ కొత్త అల్లాయ్ వీల్స్, స్పోర్టీ ఫినిషింగ్‌ను వెల్లడిస్తాయి.

వెన్యూ లోపలి భాగం కూడా ఈసారి చాలా మారనుంది. డ్యూయల్ స్క్రీన్‌లను బాగా ఉంచడానికి డాష్‌బోర్డ్‌ను రీ డిజైన్ చేశారు. సెంటర్ కన్సోల్, ఏసీ వెంట్లు హారిజంటల్‌గా తిరిగి డిజైన్ చేశారు. క్యాబిన్ వెడల్పుగా అనిపించేలా. యాంబియంట్ లైటింగ్, కొత్త స్టీరింగ్ వీల్, మెరుగైన సీట్ అప్హోల్స్టరీ కూడా అందించారు. హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీ ద్వారా అనేక కనెక్టెడ్ ఫీచర్లు అందిస్తుంది.

2025 హ్యుందాయ్ వెన్యూ అదే నమ్మకమైన ఇంజిన్ ఎంపికలను అందిస్తూనే ఉంటుంది. మూడు ఇంజన్లు ఉంటాయి. 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్,1.5-లీటర్ డీజిల్ ఇంజిన్

ఈ ఇంజన్లు మాన్యువల్, iMT, DCT గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4, 2025న భారతదేశంలో విడుదల కానుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో బలమైన పట్టును తిరిగి స్థాపించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మెరుగైన భద్రతా ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్‌తో, ఈ కారు ఈ విభాగంలో ఒక ప్రధాన గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories