2026 Honda PCX 160: 2026 హోండా PCX 160.. సరికొత్త రంగులు.. ప్రీమియం ఫీచర్లు..!

2026 Honda PCX 160: 2026 హోండా PCX 160.. సరికొత్త రంగులు.. ప్రీమియం ఫీచర్లు..!
x

2026 Honda PCX 160: 2026 హోండా PCX 160.. సరికొత్త రంగులు.. ప్రీమియం ఫీచర్లు..!

Highlights

హోండా టూ-వీలర్స్ తన బెస్ట్ సెల్లింగ్ మ్యాక్సీ స్కూటర్ హోండా PCX 160 2026 మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ 2012లో ప్రారంభించారు. అప్పటి నుండి ఇది దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఇప్పుడు కంపెనీ తన 2026 మోడల్‌ను కొన్ని కొత్త రంగు ఎంపికలతో అప్‌డేట్ చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను బ్రెజిల్‌లో విడుదల చేసింది.

ఇప్పటి రోజుల్లో జీమెయిల్ కేవలం మెయిల్స్ పంపడానికి, చదవడానికి మాత్రమే కాదు.. పనిని సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి కూడా ఉపయోగపడే ఒక స్మార్ట్ టూల్‌గా మారింది. చాలా మంది యూజర్లు కేవలం మెయిల్స్ చెక్ చేయడానికే దీనిని వాడతారు. కానీ జీమెయిల్‌లో మీ ఉత్పాదకతను పెంచే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. షెడ్యూల్ సెండ్

కొన్నిసార్లు ఒక మెయిల్‌ను వెంటనే కాకుండా ఒక నిర్దిష్ట సమయానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు జీమెయిల్‌లోని Schedule Send ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ముందుగానే మెయిల్ రాసి, టైమ్, డేట్ సెట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఆ సమయంలో పంపబడుతుంది. ముఖ్యంగా అధికారిక మెయిల్స్ లేదా క్లయింట్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది.

2. స్మార్ట్ కంపోజ్

పొడవైన మెయిల్స్ రాయడంలో ఇబ్బంది పడుతున్నారా? Smart Compose ఫీచర్ మీకు సాయం చేస్తుంది. మీరు టైప్ చేయడం ప్రారంభించగానే వాక్యాలను సజెస్ట్ చేస్తుంది. దీని వల్ల మీ టైమ్ ఆదా అవుతుంది, మెయిల్ రాయడం కూడా ఈజీ అవుతుంది.

3. కాన్ఫిడెన్షియల్ మోడ్

ప్రైవేట్ లేదా ముఖ్యమైన సమాచారం పంపించాల్సి ఉంటే Confidential Mode వాడవచ్చు. దీని ద్వారా మెయిల్‌కు ఒక ఎక్స్‌పైరీ డేట్ సెట్ చేయవచ్చు. ఆ తర్వాత అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. అంతేకాకుండా ఆ మెయిల్‌ను ఫార్వార్డ్ చేయడం, కాపీ చేయడం, డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు.

4. ఆఫ్‌లైన్ మోడ్

ఇంటర్నెట్ లేకపోతే మెయిల్స్ చదవడం, రిప్లై ఇవ్వడం కష్టమే. కానీ Offline Mode తో ఆ సమస్యే ఉండదు. కనెక్షన్ లేకపోయినా మీరు మెయిల్స్ రాయొచ్చు. డివైజ్ ఆన్‌లైన్‌లోకి వచ్చాక అవి ఆటోమేటిక్‌గా పంపబడతాయి.

5. ఫిల్టర్లు & లేబుల్స్

రోజూ వందల కొద్దీ మెయిల్స్ వస్తే వాటిని మేనేజ్ చేయడం కష్టం. అప్పుడు Filters & Labels ఫీచర్ వాడాలి. ఒకే తరహా మెయిల్స్‌ను వర్గాలుగా విభజించి సులభంగా కనుగొనవచ్చు. దీంతో ఇన్‌బాక్స్ మరింత క్రమబద్ధంగా ఉంటుంది.

ఈ ఫీచర్లను వాడడం ప్రారంభిస్తే మీ జీమెయిల్ అనుభవం మరింత సులభం, వేగవంతం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories