April Launching Cars: ఈ నెలలో రాబోయే బెస్ట్ కార్స్ ఇవే గురూ.. మీ బడ్జెట్‌లో ఇవే మంచి ఎంపిక..!

April 2025 Launching Cars Volkswagen Tiguan R Line, MG M9, Nissan Magnite CNG
x

April Launching Cars: ఈ నెలలో రాబోయే బెస్ట్ కార్స్ ఇవే గురూ.. మీ బడ్జెట్‌లో ఇవే మంచి ఎంపిక..!

Highlights

April Launching Cars: ఈ నెలలో భారతదేశంలో చాలా కొత్త కార్లు విడుదల కానున్నాయి. అందుబాటు ధరల్లో ఉండే కార్ల నుంచి లగ్జరీ కార్ల వైపు ప్రయాణం ప్రారంభం కానుంది.

April Launching Cars: ఈ నెలలో భారతదేశంలో చాలా కొత్త కార్లు విడుదల కానున్నాయి. అందుబాటు ధరల్లో ఉండే కార్ల నుంచి లగ్జరీ కార్ల వైపు ప్రయాణం ప్రారంభం కానుంది. మీరు రాబోయే కొద్ది రోజుల్లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ అవకాశం మీకు చాలా మంచిదని నిరూపించవచ్చు. ఎంజీ, నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్ తమ కొత్త కార్లను భారతదేశంలో విడుదల చేయబోతున్నాయి. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే.. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Volkswagen Tiguan R Line

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్‌ను ఏప్రిల్ 14న భారతదేశంలో విడుదల చేయవచ్చు. కంపెనీ ఇటీవలే ఈ వాహనాన్ని బుక్ చేయడం ప్రారంభించింది. ఈసారి కొత్త మోడల్ చాలా కొత్త మార్పులతో రానుంది. ఇది కంపెనీకి చెందిన ఫుల్ సైజ్ ఎస్‌యూవీగా రానుంది. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ.

MG M9

ఎంజీ తన కొత్త సైబర్‌స్టర్, M9 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని ఈ నెలలో విడుదల చేయబోతోంది. వీటిలో ఒక సూపర్ స్పోర్ట్స్, ఒక ఎమ్‌పివి ఉన్నాయి. ఈ రెండు కార్లను జనవరి 2025లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎంజీ ప్రదర్శించింది. ఈ రెండు వాహనాల కోసం కస్టమర్‌లు ఎదురుచూస్తున్నారు.

Nissan Magnite CNG

నిస్సాన్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ CNG ను కూడా భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈ కారు ధర ఏప్రిల్‌లో వెల్లడికానుంది. పెట్రోల్ మోడల్ ధరతో పోలిస్తే సిఎన్‌జి మోడల్ ధర 70 నుండి 80 వేల రూపాయలు పెరగవచ్చు. అయితే దీనికి సంబంధించి నిస్సాన్ ఇంకా సమాచారం ఇవ్వలేదు. త్వరలో కంపెనీ ఈ వాహనం గురించి మరింత సమాచారం వెల్లడించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories