Ather Energy: గుడ్ న్యూస్.. ఏథర్ నుంచి త్వరలోనే చౌక స్కూటర్

Ather Energy
x

Ather Energy: గుడ్ న్యూస్.. ఏథర్ నుంచి త్వరలోనే చౌక స్కూటర్

Highlights

Ather Energy: భారతదేశంలో టీవీఎస్, బజాజ్, ఓలా, హీరో లాంటి పెద్ద కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా పాపులర్ అయ్యాయి.

Ather Energy: భారతదేశంలో టీవీఎస్, బజాజ్, ఓలా, హీరో లాంటి పెద్ద కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా పాపులర్ అయ్యాయి. ఏథర్ ఎనర్జీ కూడా తన రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంచి విజయం సాధించి, ఇటీవల లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇప్పుడు ఈ కంపెనీ ఒక కొత్త, ఇంకా చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనిచేస్తోంది. దాని పేరు EL ప్లాట్‌ఫామ్. దీన్ని 2025లో జరిగే ఎథర్ కమ్యూనిటీ డే నాడు లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఏథర్ ఇంతకుముందు 450X లాంటి పర్ఫార్మెన్స్-ఫోకస్డ్ స్కూటర్లను తయారు చేసింది. కానీ వాటి ధర ఎక్కువ కావడం వల్ల అమ్మకాలు అంతగా లేవు. ఆ తర్వాత ఏథర్ రిజ్తాను లాంచ్ చేసింది. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్, దీని ప్రారంభ ధర రూ.99,999. ఇది ఏథర్ నుండి వచ్చిన అత్యంత చౌకైన మోడల్. రిజ్తా డిజైన్ బాగుండడం, ధర కూడా కొంతవరకు అందుబాటులో ఉండటంతో, అది త్వరగానే ఏథర్ బెస్ట్‌సెల్లర్‌గా మారింది.

కానీ రూ.లక్ష ధర ఇప్పటికీ చాలా మంది కొనుగోలుదారులకు ఎక్కువగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఓలా, విడా, టీవీఎస్ లాంటి బ్రాండ్లు ఇంతకంటే తక్కువ ధరకే స్కూటర్లను అమ్ముతుండడంతో ఏథర్ ఇప్పుడు ఈ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి కొత్త EL ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌ను తీసుకురాబోతోంది. ఇది ఇంకా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.

ఏథర్ ఈ కొత్త EL ప్లాట్‌ఫామ్ గురించి ఇంకా ఎక్కువ వివరాలు చెప్పలేదు. కానీ, ఇది చాలా తక్కువ ధరలో ఉంటుందని మాత్రం చెప్పింది. బడ్జెట్‌లో స్కూటర్ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను తయారు చేస్తున్నారు. ఏథర్ రాబోయే ఈ కొత్త స్కూటర్‌లో ఫీచర్ల లిస్ట్ చాలా పెద్దగా ఉండకపోవచ్చు. అంటే, ఇందులో సింపుల్ డిస్‌ప్లే, లో కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లు, ఇంకా లిమిటెడ్ రైడ్ అసిస్ట్ ఫీచర్లు మాత్రమే ఉండొచ్చు. ధర తగ్గించడానికి ఇలాంటి మార్పులు చేస్తారు.

ఏథర్ తన ఈవెంట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఏథర్ స్టాక్ 7.0ను కూడా లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త ఫీచర్లు ఉంటాయి, అవి రిజ్తా, 450S, 450X, 450 అపెక్స్ స్కూటర్లలో లభిస్తాయి. గతంలో ఉన్న స్టాక్ 6.0 లో వాట్సాప్ నోటిఫికేషన్లు, అలెక్సా కమాండ్స్, లైవ్ లొకేషన్, పింగ్ మై స్కూటర్ లాంటి ఫీచర్లు ఉండేవి. స్టాక్ 7.0 లో వీటి కంటే కూడా లేటెస్ట్ ఫీచర్లు ఇవ్వబోతున్నారు. ఏథర్ తన గ్రిడ్ ఫాస్ట్ ఛార్జర్ల కొత్త వెర్షన్‌ను కూడా తీసుకొస్తోంది. ఇది చాలా వేగంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ గ్రిడ్ ఛార్జర్ స్కూటర్‌ను నిమిషానికి 1.5 కి.మీ దూరం ప్రయాణించేంత ఛార్జ్ చేయగలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories