Atumobile Atum Version 1.0: మన హైదరాబాద్ బండి.. ధర జస్ట్ రూ. 61 వేలే.. 100 కిమీ రేంజ్..!

Atumobile Atum Version 1.0
x

Atumobile Atum Version 1.0: మన హైదరాబాద్ బండి.. ధర జస్ట్ రూ. 61 వేలే.. 100 కిమీ రేంజ్..!

Highlights

Atumobile Atum Version 1.0: హైదరాబాద్ కు చెందిన అటుమొబైల్ ఎలక్ట్రిక్ కంపెనీ లోకాస్ట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ను తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు ముందుకు వేస్తోంది.

Atumobile Atum Version 1.0: హైదరాబాద్ కు చెందిన అటుమొబైల్ ఎలక్ట్రిక్ కంపెనీ లోకాస్ట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ను తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే అటుమొబైల్ అటమ్ వెర్షన్ 1.0 పేరుతో లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటర్‌ సైకిల్ పరిచయం చేసింది. 2020లో లాంచ్ అయిన మోడల్ మరిన్ని అప్ డేట్స్ తో వస్తోంది. ముఖ్యంగా ఇంట్రా సిటీ కమ్యూట్‌కు సూటబుల్‌ గా డిజైన్ చేయబడింది. ఇది మినిమలిస్టిక్ స్టైల్‌ ను కలిగి ఉంటుంది. లైట్‌వెయిట్, ఎకో ఫ్రెండ్లీ గా ఉంటుంది. టాప్ స్పీడ్ 25 కిలో మీటర్లు కావడంతో దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది అన్ని వయసుల వాళ్లు నడిపే అవకాశం ఉంది.

ఈ బైక్ కమ్యూటర్ స్టైల్‌ తో వస్తుంది. Li-ion, 48V 26Ah బాయటరీని కలిగి ఉంటుంది. 0.34 నుంచి 1.25 kWh కెపాసిటీని కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, రోడ్ కండిషన్స్, లోడ్ బట్టి రేంజ్ మారే అవకాశం ఉంటుంది. టాప్ స్పీడ్ 25 కిలో మీటర్లు ఉంటుంది. చార్జింగ్ టైమ్ 3 నుంచి 4 గంటలు పడుతుంది. బ్యాటరీకి ఏడాది, మోటార్ కు రెండేళ్ల గ్యారెంటీ ఉంటుంది. ఈ బైక్ రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, గ్రేలో అందుబాటుటో ఉంటుంది.

అటమ్ వెర్షన్ 1.0 మినిమలిస్టిక్ స్టైల్, స్లిమ్ బాడీ, స్ప్లిట్ సీట్, స్పేషియస్ ఫ్లోర్‌ బోర్డ్, పోర్టబుల్ బ్యాటరీ సపోర్టుతో వస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ వెర్షన్ లో ఉంటుంది. స్పీడోమీటర్, ఓడో మీటర్, బ్యాటరీ లెవల్, ట్రిప్ మీటర్ ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్, టర్న్ సిగ్నల్స్ ఉంటాయి. USB చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, లో బ్యాటరీ ఇండికేటర్, వాటర్ రెసిస్టెంట్ బాడీ ఉంటుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, రిజెనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, హబ్ మోటార్ ఉంటుంది. రన్నింగ్ కాస్ట్ కిలో మీటర్లకు జస్ట్ 10 పైసలు అవుతుంది.

అటమ్ వెర్షన్ 1.0 బైక్ ధర రూ. 61,500గా ఉంటుంది. ఆన్ రోడ్ ధర రూ. 65,000 – రూ.75,000 వరకు ఉంటుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. అఫర్డబుల్, లాంగ్ రేంజ్, లో రన్నింగ్ కాస్ట్, పోర్టబుల్ బ్యాటరీ, మేడ్ ఇన్ ఇండియా, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అయితే టాప్ స్పీడ్ లిమిటెడ్, హైవే రైడ్‌కు సూటబుల్ కాదు. బిల్డ్ క్వాలిటీపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా డీలర్లు, ఆన్‌లైన్ బుకింగ్ అవైలబుల్ ఉంది. పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఏడాదికి రూ.40 వేలకు పైగా సేవ్ చేసే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories