Pulsar N150 : బైకర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక పల్సర్ N150 బైక్ రోడ్లపై కనిపించదు

Pulsar N150
x

Pulsar N150 : బైకర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక పల్సర్ N150 బైక్ రోడ్లపై కనిపించదు

Highlights

Pulsar N150 : భారత మార్కెట్‌లో బజాజ్ ఆటో తమ పల్సర్ బైక్స్ సిరీస్ నుంచి పల్సర్ N150 మోడల్‌ను నిలిపివేసింది. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది. పల్సర్ N150 బైక్‌ను సెప్టెంబర్ 2023లో మార్కెట్లోకి విడుదల చేశారు.

Pulsar N150 : భారత మార్కెట్‌లో బజాజ్ ఆటో తమ పల్సర్ బైక్స్ సిరీస్ నుంచి పల్సర్ N150 మోడల్‌ను నిలిపివేసింది. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది. పల్సర్ N150 బైక్‌ను సెప్టెంబర్ 2023లో మార్కెట్లోకి విడుదల చేశారు. నిలిపివేసే ముందు దీని ధర రూ.1,24,730 (ఎక్స్-షోరూమ్) ఉండేది. ఇంత తక్కువ సమయంలోనే ఈ బైక్‌ను ఆపేయడానికి కారణం దాని తక్కువ అమ్మకాలే అయ్యి ఉండొచ్చు.

బజాజ్ పల్సర్ N150 అనేది పల్సర్ N160తో తన ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంది. కానీ, కొన్ని ఖర్చులు తగ్గించే చర్యలతో N150ని తీసుకొచ్చారు. ఉదాహరణకు, N160లో డ్యూయల్ ఛానెల్ ABS ఉండగా, N150లో సింగిల్ ఛానెల్ ABS మాత్రమే ఉంది. పల్సర్ N150, పల్సర్ N160 మధ్య ధర దాదాపు రూ.8,000 మాత్రమే తేడా ఉండేది. తక్కువ ధర ఉన్నా, దీని అమ్మకాలు అంతగా జరగకపోవడం వల్ల బజాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ బైక్‌లో LED హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ ఉండేవి. అలాగే, రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే నెగటివ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండేది. ఇందులో కాల్ అలర్ట్స్, రియల్-టైమ్ మైలేజ్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ రీడౌట్ వంటి ఫీచర్లు ఉండేవి. ఈ బైక్ టీవీఎస్ అపాచే RTR 160, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R వంటి బైక్స్‌కు పోటీ ఇచ్చేది.

పల్సర్ N150లో 149.68 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్(14.5PS/13.5Nm) ఉండేది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయి ఉండేది. ఇంజిన్‌ను మెరుగుపరిచినా 160 సీసీ విభాగంలో దీని పోటీదారులు పవర్ ఫుల్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌లను అందించాయి. ఇదే పల్సర్ N150 అమ్మకాలపై ప్రభావం చూపించి ఉంటాయి. మే 2025 లో బజాజ్ అమ్మకాలు చూస్తే, క్లాసిక్ పల్సర్ 150, పల్సర్ N150 రెండూ కలిపి బజాజ్ భారతదేశంలో 15,937 యూనిట్ల 150cc పల్సర్‌లను విక్రయించింది. మే 2024 లో 29,386 యూనిట్లతో పోలిస్తే, అమ్మకాలు దాదాపు సగానికి తగ్గాయి. ఇది అమ్మకాల్లో పెద్ద పతనాన్ని సూచిస్తుంది.

దీనికితోడు బజాజ్ 22,372 యూనిట్ల 160cc పల్సర్‌లను విక్రయించింది. ఇక్కడ కంపెనీ సంవత్సరానికి 24.88% పెరుగుదలను నమోదు చేసింది. ఇది 150cc పల్సర్ల కంటే 160cc పల్సర్ల వైపు కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలియజేస్తుంది. బజాజ్ 160cc బైక్ అమ్మకాలను కూడా చురుగ్గా ప్రోత్సహిస్తోంది. ఈ 160cc బైక్‌లలో USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్-ఛానెల్ ABS, ఇతర మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories