Bajaj Pulsar NS400Z: యూత్‌ కోసం రోడ్‌ రాకెట్‌.. బజాజ్ నుంచి కొత్త పల్సర్..!

Bajaj Pulsar NS400Z: యూత్‌ కోసం రోడ్‌ రాకెట్‌.. బజాజ్ నుంచి కొత్త పల్సర్..!
x

Bajaj Pulsar NS400Z: యూత్‌ కోసం రోడ్‌ రాకెట్‌.. బజాజ్ నుంచి కొత్త పల్సర్..!

Highlights

బజాజ్‌ పల్సర్‌ అంటే యువతలో ఒక క్రేజ్‌. ఇప్పుడు ఆ క్రేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తూ వచ్చిన బైక్‌ - Bajaj Pulsar NS400Z. పవర్‌, ప్రైస్‌, పెర్ఫార్మెన్స్‌ అన్నీ కలిపితే ఈ బైక్‌.

Bajaj Pulsar NS400Z: బజాజ్‌ పల్సర్‌ అంటే యువతలో ఒక క్రేజ్‌. ఇప్పుడు ఆ క్రేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తూ వచ్చిన బైక్‌ - Bajaj Pulsar NS400Z. పవర్‌, ప్రైస్‌, పెర్ఫార్మెన్స్‌ అన్నీ కలిపితే ఈ బైక్‌. ఇది రోడ్‌పై ఒక మాన్‌స్టర్‌లా పరుగులు తీస్తుంది. అయితే, మీరు Bajaj Pulsar NS400Z కొనే ముందు ఈ 5 విషయాలు (ఇంజిన్‌, ABS‌ మోడ్స్‌, బరువు, సీటు ఎత్తు, ధర) తప్పక తెలుసుకోవాలి.

పల్సర్‌ NS400Zలో 373cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది Dominar 400 నుంచి తీసుకున్నదే. తాజా అప్‌డేట్‌తో ఈ ఇంజిన్‌ ఇప్పుడు 43hp పవర్‌ (9,000rpm), 35Nm టార్క్‌ (7,500rpm) ఇస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్‌-అండ్‌-అసిస్ట్‌ క్లచ్‌ కూడా ఉంది. అంటే.. గేర్‌ మార్చడం చాలా కామ్‌గా, ఎక్సైటింగ్‌గా & రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ వెన్న మీద జారిపోతున్నంత స్మూత్‌గా ఉంటుంది.

రైడర్‌ & కోరైడర్‌ సేఫ్టీ విషయంలో కూడా బజాజ్‌ ఎటువంటి రాజీ పడలేదు. NS400Zలో డ్యూయల్‌ చానెల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది, అంటే బేస్‌ మోడల్‌ నుంచే డ్యూయల్‌ చానెల్‌ ABS అందుబాటులో ఉంటుంది. రైడింగ్‌ కండిషన్‌ ఆధారంగా Road, Rain, Off-road అనే మూడు మోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, మార్చుకోగల ట్రాక్షన్‌ కంట్రోల్‌ కూడా ఉంది. అంటే, ఏ పరిస్థితిలో అయినా కంట్రోల్‌ మీ చేతుల్లోనే ఉంటుంది.

Bajaj Pulsar NS400Z బైక్‌ కర్బ్‌ వెయిట్‌ 174kg మాత్రమే. ఇంత తేలికగా ఉండి ఇంత శక్తి ఇవ్వడం వల్ల, ఈ సెగ్మెంట్‌లో ₹2 లక్షల లోపు (ఎక్స్‌-షోరూమ్‌) బైక్స్‌లో బెస్ట్‌ పవర్‌ టు వెయిట్‌ రేషియో కలిగినదిగా పేరు తెచ్చుకుంది. నగరాల్లో, హైవేల్లో - ఎక్కడైనా దీనితో రైడ్‌ అంటే ఫన్‌ కచ్చితంగా వస్తుంది.

బజాజ్‌ పల్సర్‌ NS400Z సీటు ఎత్తు 807mm మాత్రమే. అంటే ఓ మోస్తరు ఎత్తు ఉన్న రైడర్‌కు కూడా ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. ట్రాఫిక్‌లో కూడా బైక్‌ హ్యాండ్లింగ్‌ ఈజీగా ఉంటుంది. కంఫర్ట్‌, కంట్రోల్‌ రెండూ సమానంగా ఉంటాయి.

ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో బజాజ్‌ పల్సర్‌ NS400Z ₹1.93 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో అందుబాటులో ఉంది. GST రీ-స్ట్రక్చరింగ్‌ తర్వాత కూడా ఈ బండి ధరను కంపెనీ పెంచలేదు. అంటే ఈ ప్రైస్‌ రేంజ్‌లో ఇంత పవర్‌ఫుల్‌ బైక్‌ దొరకడం కష్టం. హైదరాబాద్‌, విజయవాడ లాంటి తెలుగు నగరాల్లో షోరూమ్‌ ఆన్‌-రోడ్‌ ధరలు రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ ఆధారంగా మారుతాయి.

పవర్‌, ప్రెజెన్స్‌, ప్రైస్‌ - ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపిన బైక్‌ Pulsar NS400Z. రోడ్‌పై ఈ బైక్‌ చూపించే దూకుడు మీ మనసు దోచేస్తుంది. మొదటి బైక్‌గా కొనేవారికైనా, అప్‌గ్రేడ్‌ చేయాలనుకునేవారికైనా ఇది ఒక "పవర్‌ ప్యాక్‌" ఆప్షన్‌. అయితే కొనేముందు తప్పక టెస్ట్‌ రైడ్‌ తీసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories