Best Budget 7-Seater Family Cars: బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ కార్లు.. వీటిలో మీకు నచ్చింది ఉందా..?

Best Budget 7-Seater Family Cars
x

Best Budget 7-Seater Family Cars: బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ కార్లు.. వీటిలో మీకు నచ్చింది ఉందా..?

Highlights

Best Budget 7-Seater Family Cars: 7 సీట్ల కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కనీసం ఆరుగురు సభ్యులు ఉంటున్నారు.

Best Budget 7-Seater Family Cars: 7 సీట్ల కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కనీసం ఆరుగురు సభ్యులు ఉంటున్నారు. అందుకే బడ్జెట్ ధరలో లభించే 7 సీట్ల కార్లు కొనేందుకు ఎక్కువమంది ఆస్తకి చూపుతున్నారు. ఎక్కువ మందితో తరచుగా ప్రయాణించే వారికి ఎమ్‌పీవీ సెగ్మెంట్ కార్లు సరిపోతాయి. దేశంలో ఎక్కువగా సేల్ అవుతూ వినియోగదారులకు ఫేవరేట్‌గా 7 సీట్ల కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Renault Triber MPV

ఈ జాబితాలో మీ కోసం మొదటి కారు రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పీవీ, ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన ఎమ్‌పీవీ. ఈ రెనాల్ట్ కారులో మీరు ఒక లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.09 లక్షలు, టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది.

Maruti Suzuki Ertiga

జాబితాలో రెండవ కారు మారుతి ఎర్టిగా, ఇది ఎమ్‌పీవీ విభాగంలో బాగా అమ్ముడవుతోంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్, CNG ఇంజన్లు ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ మారుతి కారు ఈ విభాగంలో చాలా మందికి నచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.96 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దాని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.25 లక్షలు.

Toyota Rumian

మూడవ కారు పేరు టయోటా రూమియన్, ఈ టయోటా కారులో 1.5-లీటర్ కెపాసిటి గల నేచురల్లీ ఆస్పిరేటెడ్ సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఈ ఎమ్‌పీవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.54 లక్షల నుండి ప్రారంభమై రూ. 13.83 లక్షల వరకు ఉంటుంది.

Kia Cars

ఇది కాకుండా, మీ కోసం నాల్గవ ఎంపిక కియా కారెన్స్ కావచ్చు. ఈ కియా కారులో 1.5 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్, డీజిల్ ఇంజన్లు అందించారు. కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి ప్రారంభమై రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories