Renault Duster : క్రెటా, సెల్టోస్ ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలు.. రూ.10 లక్షలకే అదిరిపోయే ఎస్‌యూవీ

Renault Duster : క్రెటా, సెల్టోస్ ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలు.. రూ.10 లక్షలకే అదిరిపోయే ఎస్‌యూవీ
x
Highlights

క్రెటా, సెల్టోస్ ఫ్యాన్స్‌కు టెన్షన్ మొదలు.. రూ.10 లక్షలకే అదిరిపోయే ఎస్‌యూవీ

Renault Duster : ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై ఎస్‌యూవీ అంటే గుర్తొచ్చే పేరు రెనాల్ట్ డస్టర్. కాలక్రమేణా పోటీ పెరగడంతో వెనకబడిన ఈ కారు, ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్ళీ మార్కెట్‌ను ఏలడానికి సిద్ధమైంది. 2026 మార్చిలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ కొత్త డస్టర్, ఇప్పటికే ఉన్న క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ధర విషయంలో కూడా ప్రైస్ వార్ మొదలుపెట్టబోతోంది. కొత్త రెనాల్ట్ డస్టర్ 2026 మార్చి నుంచి షోరూమ్‌లలో సందడి చేయనుంది. ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును ముందే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్ల హవా నడుస్తోంది. ఇప్పుడు ఆ కోల్పోయిన సామ్రాజ్యాన్ని మళ్ళీ చేజిక్కించుకోవడానికి రెనాల్ట్ పక్కా ప్లాన్‌తో వస్తోంది. ఏప్రిల్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కొత్త డస్టర్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ధరతో మార్కెట్లోకి వస్తే, క్రెటా (రూ.10.79 లక్షలు), సెల్టోస్ (రూ.10.99 లక్షలు) కంటే ఇది చౌకగా మారుతుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇవ్వడం ద్వారా కస్టమర్లను తనవైపు తిప్పుకోవాలని రెనో భావిస్తోంది.

కొత్త డస్టర్ రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. ఒకటి 163 BHP (1.3 లీటర్), మరొకటి 100 BHP (1.0 లీటర్) పవర్‌ను జనరేట్ చేస్తాయి. అయితే, అసలైన హైలైట్ ఏంటంటే.. 2026 దీపావళి నాటికి ఇందులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ రానుంది. 1.8 లీటర్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 160 BHP పవర్‌ను ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ విటారా, హైరైడర్ (116 BHP) కంటే ఇది చాలా శక్తివంతమైనది. అంటే పవర్‌తో పాటు మైలేజీలో కూడా ఇది కింగ్ అనిపించుకోనుంది.

ఈ కారులో 700 లీటర్ల భారీ బూట్ స్పేస్ , గూగుల్ బిల్ట్-ఇన్ మల్టీమీడియా సిస్టమ్, 48 రంగుల యాంబియంట్ లైటింగ్, మల్టీ-సెన్స్ డ్రైవ్ మోడ్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రెనాల్ట్ ఫరెవర్ ప్రోగ్రామ్ కింద ఏకంగా 7 ఏళ్లు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందిస్తోంది. 50కి పైగా యాక్సెసరీలతో కారును మనకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే వీలుండటం మరో విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories