Electric Car Market: 2028 నాటికి భారత ఈవీ మార్కెట్‌లో 7% వాటా దాటనుందట..

Electric Car Market: 2028 నాటికి భారత ఈవీ మార్కెట్‌లో 7% వాటా దాటనుందట..
x

Electric Car Market: 2028 నాటికి భారత ఈవీ మార్కెట్‌లో 7% వాటా దాటనుందట.. 

Highlights

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సరఫరా గొలుసు సమస్యలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొరత వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% దాటుతుందని కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక పేర్కొంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సరఫరా గొలుసు సమస్యలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొరత వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% దాటుతుందని కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక పేర్కొంది. అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో ఈ రంగంపై నమ్మకం మరింత పెరిగింది.

భారత ఈవీ మార్కెట్ వృద్ధి

2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,000 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, 2025 నాటికి ఈ సంఖ్య 1.07 లక్షలు దాటింది.

ఇప్పటికీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకే పెద్ద మార్కెట్ ఉన్నా, ఫోర్ వీలర్స్ విభాగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

వృద్ధికి ప్రధాన కారణాలు

ప్రభుత్వ ప్రోత్సాహకాలు: ఫేమ్-3, అధునాతన బ్యాటరీలకు PLI పథకం, బ్యాటరీ ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్ సుంకం మినహాయింపు.

చార్జింగ్ మౌలిక సదుపాయాలు: 2022లో 5,151 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా, 2025 ప్రారంభానికి ఈ సంఖ్య 26,000 దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు భూమి, సబ్సిడీ లాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

ప్రైవేట్ రంగం భాగస్వామ్యం: CPOలు తమ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నారు. BEE, NITI ఆయోగ్ ఛార్జర్ స్టాండర్డైజేషన్, ఇంటర్‌ఆపరేబిలిటీపై పనిచేస్తున్నాయి.

బ్యాటరీ లోకలైజేషన్: దేశీయంగా బ్యాటరీ తయారీ పెరగడంతో, 2022లో 100% దిగుమతులపై ఆధారపడి ఉండగా, 2027 నాటికి ఇది 20%కే తగ్గే అవకాశం ఉంది.

ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల ప్రవేశంతో భారత్‌లో ఈవీ మార్కెట్ రాబోయే ఏళ్లలో మరింత వేగంగా విస్తరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories