Ev Offers 2025: ఫెస్టివల్ సేల్.. రూ.50 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్..!

Ev Offers 2025: ఫెస్టివల్ సేల్.. రూ.50 వేల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్..!
x
Highlights

Ev Offers 2025: భారతీయులు ధంతేరస్, దీపావళి పండుగల సమయంలో కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు.

Ev Offers 2025: భారతీయులు ధంతేరస్, దీపావళి పండుగల సమయంలో కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. శనివారం ఉదయం నుండి మార్కెట్లు కస్టమర్లతో సందడి సందడిగా ఉన్నాయి. బైక్‌లు, కార్లు, స్కూటర్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ధంతేరస్,దీపావళి గొప్ప సమయం.ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. రూ.50,000 కంటే తక్కువ ధరకే లభించే కొన్ని స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Komaki XR1

కోమకి XR1 స్కూటర్ కూడా తక్కువ ధరకు లభిస్తుంది. కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ప్రత్యేకమైనది. దీని డిజైన్ చాలా సింపుల్, మోపెడ్‌ను పోలి ఉంటుంది. ఇది తక్కువ దూరం సిటీ ప్రయాణాలకు సరిపోతుంది. దీని రేంజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70–80 కి.మీ, గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. డ్రమ్ బ్రేక్‌లు, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉన్నాయి. కోమాకి XR1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 29,999.

Komaki X One Lithium Ion

కోమాకి ఈ వేరియంట్ ప్రత్యేకమైనది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.75 కిలోవాట్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటారు ఉన్నాయి. ఇది సుమారు 85 కి.మీ రేంజ్, 45 కి.మీ/గం గరిష్ట వేగాన్ని అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ సన్నగా, ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఇందులో డిజిటల్ కన్సోల్, పోర్టబుల్ బ్యాటరీ, మెయిన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. కోమాకి X వన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.49,999గా నిర్ణయించారు.

TVS XL100 Heavy Duty

దేశ రోడ్లపై సంచలనాలు సృష్టిస్తున్న TVS XL100 నమ్మదగిన మోటర్ సైకిల్. దశాబ్దాలుగా ఎందరో హృదయాలను ఏలుతోంది. ముఖ్యంగా ఇది స్కూటర్, మోటార్ సైకిల్ పరిపూర్ణ కలయిక. 99.7సీసీ ఇంజిన్‌ కూడా ఉంది. ఈ ఇంజిన్ 4.4 పీఎస్ పవర్, 6.5 ఎన్ఎమ్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. దీని మైలేజ్ కూడా అద్భుతంగా ఉంది, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. TVS XL100 హెవీ డ్యూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ.43,900గా నిర్ణయించారు.

Vida VX2 Go BaaS

హీరో మోటోకార్ప్ ఈవీ బ్రాండ్ విడా నుండి వచ్చిన VX2 Go BaaS, కఠినమైన రోడ్లు, హైవేలపై మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్‌లో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ దాదాపు 90 కి.మీ రేంజ్, 45 కి.మీ/గం గరిష్ట వేగాన్ని అందించగలదు. ఈ స్కూటర్‌లో డిజిటల్ కన్సోల్, రైడింగ్ మోడ్‌లు, డ్రమ్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.44,990.

Show Full Article
Print Article
Next Story
More Stories