Maruti Victoris : క్రెటాకు టెన్షన్ మొదలైంది..మారుతి విక్టోరిస్‌పై ఏకంగా రూ.78,000 వరకు తగ్గింపు

Maruti Victoris : క్రెటాకు టెన్షన్ మొదలైంది..మారుతి విక్టోరిస్‌పై ఏకంగా రూ.78,000 వరకు తగ్గింపు
x
Highlights

క్రెటాకు టెన్షన్ మొదలైంది..మారుతి విక్టోరిస్‌పై ఏకంగా రూ.78,000 వరకు తగ్గింపు

Maruti Victoris : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోరుకునే వారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి విక్టోరిస్ పై లాంచ్ అయిన తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ కారుపై ఏకంగా రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఏ వేరియంట్‌పై ఎంత డిస్కౌంట్?

మారుతి సుజుకి విక్టోరిస్ ప్రస్తుతం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ఆఫర్లు ఇలా ఉన్నాయి:

LXi & VXi (పెట్రోల్, సీఎన్‌జీ): ఈ బేస్ వేరియంట్లపై మొత్తం రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.30,000 కస్టమర్ ఆఫర్ కాగా, రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది.

ZXi & ZXi+: ఈ టాప్ ఎండ్ మోడళ్లపై రూ.61,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.41,000 ఆఫర్, రూ.20,000 బోనస్ కలిసి ఉన్నాయి.

హైబ్రిడ్ వేరియంట్స్: పర్యావరణ హితమైన హైబ్రిడ్ మోడల్ ఎంచుకుంటే అత్యధికంగా రూ.78,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ.48,000 నేరుగా తగ్గింపు, రూ.30,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి.

విక్టోరిస్‌తో పాటు మారుతి తన ప్రీమియం మోడల్ గ్రాండ్ విటారా పై కూడా ఆఫర్లు ప్రకటించింది. గ్రాండ్ విటారా ఎంట్రీ-లెవల్ సిగ్మా వేరియంట్‌పై రూ.25,000 ఆఫర్, రూ.35,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తోంది. అయితే, గ్రాండ్ విటారాలోని హై-ఎండ్ వేరియంట్లపై కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక తగ్గింపులను ధృవీకరించలేదు.

ఇంజిన్ సామర్థ్యం, ప్రత్యేకతలు

మారుతి విక్టోరిస్ ఇంజిన్ ఆప్షన్ల విషయంలో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మూడు రకాల ఇంజిన్లతో వస్తుంది:

1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్: ఇది 103 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని ఇస్తుంది.

1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్, ఇది 116 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

1.5 లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ: ఇది 89 హార్స్‌పవర్‌ను ఇస్తుంది.

విశేషమేమిటంటే, సీఎన్‌జీ వెర్షన్‌లో ట్యాంకును కారు అడుగు భాగంలో అమర్చారు. దీనివల్ల బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గదు. మైల్డ్ హైబ్రిడ్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుండగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories