Hero Glamour X: క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త లుక్‌లో లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే

Hero Glamour X: క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త లుక్‌లో లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే
x

Hero Glamour X: క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త లుక్‌లో లాంచ్ – ధర, ఫీచర్లు ఇవే

Highlights

హీరో మోటోకార్ప్‌ 125 సీసీ విభాగంలో కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో రూపొందిన ఈ కొత్త బైక్‌కు హీరో గ్లామర్ X (Hero Glamour X) అని పేరు పెట్టింది. పాత గ్లామర్‌ మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక మార్పులు చేశారు.

ధర వివరాలు:

డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూమ్‌). టాప్ వేరియంట్ ధర రూ.99,999 వరకు ఉంటుంది.

డిజైన్ & స్టైల్:

కొత్తగా బల్కీ బాడీ, వంపులతో కూడిన ట్యాంక్‌, H-షేప్‌ DRLs‌తో ఫ్రంట్ హెడ్‌ల్యాంప్‌ అందంగా తీర్చిదిద్దారు. సింగిల్ పీస్ సీటు కొనసాగించారు. హ్యాండిల్ బార్ వెడల్పును 30 మిల్లీమీటర్లు పెంచారు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు.

ఇంజిన్ & పవర్:

ఇందులో 124.7 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 11.3 హెచ్‌పీ పవర్‌, 10.5 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది.

ఫీచర్లు:

రంగులతో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్

బ్లూటూత్ కనెక్టివిటీ & నావిగేషన్

60కిపైగా స్మార్ట్ ఫీచర్లు

ఎలక్ట్రానిక్ థ్రోటల్

క్రూయిజ్ కంట్రోల్

ఎకో, రోడ్‌, పవర్‌ – మూడు రైడింగ్ మోడ్‌లు

వెనుకవైపు ప్యానిక్ బ్రేక్ అలర్ట్

మొత్తంగా, హీరో గ్లామర్ X 125 సీసీ సెగ్మెంట్‌లో కొత్త లుక్‌, ఆధునిక ఫీచర్లతో బైక్ ప్రేమికులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories