Bikes discontinued in 2024: 2024 కు గుడ్ బై.. హీరో అట్టర్ ప్లాప్ బైక్స్ ఇక కనపడవు

Bikes discontinued in 2024: 2024 కు గుడ్ బై.. హీరో అట్టర్ ప్లాప్ బైక్స్ ఇక కనపడవు
x
Highlights

Bikes Discontinued in 2024: 2024 సంవత్సరం ముగియబోతోంది. అయితే ఒకవైపు ద్విచక్ర వాహన మార్కెట్‌లో పలు బైక్‌లు విడుదలవుతుండగా, మరోవైపు కొన్ని బైక్‌లకు ఈ...

Bikes Discontinued in 2024: 2024 సంవత్సరం ముగియబోతోంది. అయితే ఒకవైపు ద్విచక్ర వాహన మార్కెట్‌లో పలు బైక్‌లు విడుదలవుతుండగా, మరోవైపు కొన్ని బైక్‌లకు ఈ ఏడాది గుడ్‌బై చెప్పేసింది. హీరో మోటోకార్ప్ నుండి హోండా వరకు, ఆయా కంపెనీలకు చెందిన కొన్ని బైక్‌లు శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ బైక్‌ల ప్రొడక్షన్ నిలిపేయడానికి వాటికి ఆశించిన స్థాయిలో డిమాండ్, సేల్స్ లేకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. 2024లో ఏయే బైక్‌లు నిలిచిపోనున్నాయో ఇప్పుడు చూద్దాం.

Hero Fashion Xtec - హీరో ఫ్యాషన్ ఎక్స్‌టెక్

హీరో మోటార్‌కార్ప్ తన ఎంట్రీ లెవల్ బైక్ ప్యాషన్ ఎక్స్‌టెక్‌ను నిలిపివేసింది. సరైన అమ్మకాలు లేని కారణంగానే హీరో ఈ బైక్‌ను మార్కెట్ నుండి తొలగించాల్సి వచ్చింది. ఈ బైక్‌లో 113.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ఉంది. ఇది 9 Bhp పవర్, 9.79Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 10-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఈ బైక్ ధర రూ. 81,775 గా ఉంది.

Hero Xtreme 200S 4V - హీరో ఎక్స్‌ట్రీమ్ 200S 4V

హీరో మోటోకార్ప్ ఇండియాలో ఎక్స్‌ట్రీమ్ 200S 4Vని నిలిపివేసింది. సరైన అమ్మకాలు లేని కారణంగానే ఈ బైక్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఇది పూర్తి ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 18.9Bhp పవర్, 17.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.43 లక్షల వరకు పలికింది.

Hero XPulse 200T - హీరో ఎక్స్‌పల్స్ 200T

ఈ సంవత్సరం, హీరో మోటోకార్ప్ XPulse 200Tని నిలిపివేసింది. ఈ బైక్‌లో 199.5cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-ఆయిల్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. 8,500 RPM వద్ద 18.9 Bhp పవర్, 6,500 RPM, 17.35Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అమ్మకాలు సరిగా లేకపోవడంతో కంపెనీ ఈ బైకుని నిలిపేసింది. కంపెనీ ఈ బైకును నిలిపేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఈ బైక్ ధర రూ. 1.37 లక్షలుగా ఉంది.

Honda X Blade - హోండా ఎక్స్ బ్లేడ్

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో హోండా ఎక్స్-బ్లేడ్ బైక్‌ను కూడా నిలిపివేసింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేని కారణంగా ఈ బైక్‌ను నిలిపివేయవలసి వచ్చిందని ఆ కంపెనీ ప్రకటించింది. 2018 లో మొదటిసారిగా ఈ బైక్ లాంచ్ అయింది.ఈ బైక్‌కు 162cc సింగిల్-సిలిండర్, PGM-Fi ఇంజన్ ఇచ్చారు. ఇది శక్తివంతమైన బైక్ అయినప్పటికీ కస్టమర్‌లు దీన్ని ఇష్టపడలేదు. కంపెనీ ప్రొడక్షన్ ఆపేసేనాటికి ఈ బైక్ ధర రూ.92,902 గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories