Hero : హీరో సరికొత్త ప్లాన్.. సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు

Hero
x

Hero : హీరో సరికొత్త ప్లాన్.. సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు

Highlights

Hero : హీరో తమ కొత్త విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ ధరలు తగ్గించేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Hero : హీరో తమ కొత్త విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను భారీగా తగ్గించేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయ్యింది. ఇప్పుడు కంపెనీ ధరలు తగ్గించేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ.44,990 ప్రారంభ ధరకే లభిస్తోంది. ఇంతకు ముందు దీని ధర రూ.59,490 ఉండేది. అయితే, ఈ ధర బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌తో మాత్రమే వర్తిస్తుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్, అయితే ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో లేదా పాత ధరలు ఎప్పటి నుంచి వర్తిస్తాయో కంపెనీ ఇంకా చెప్పలేదు.

విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో వస్తుంది. Go, Plus. గతంలో BaaS తో వీటి ధరలు రూ.59,490 (Go), రూ.64,990 (Plus) గా ఉండేవి. BaaS లేకుండా Go ధర రూ.99,490, Plus ధర రూ.1.10 లక్షలు. అయితే, కొత్త ఆఫర్ కింద Go వేరియంట్ BaaS తో రూ.44,990 కు, BaaS లేకుండా రూ.84,990 కు లభిస్తుంది. అదే విధంగా, Plus వేరియంట్ BaaS తో రూ.57,990 కు, BaaS లేకుండా రూ.99,990 కు అందుబాటులో ఉంది.

Go వేరియంట్ లో 2.2kWh బ్యాటరీ ఉండగా, Plus వేరియంట్ లో 3.4kWh బ్యాటరీ వస్తుంది. Go వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్లు, Plus వేరియంట్ 142 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. స్కూటర్ నడపడానికి కిలోమీటరుకు రూపాయి కంటే తక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. BaaS ప్లాన్‌తో స్కూటర్ తీసుకుంటే బ్యాటరీ కెపాసిటీ 70% కంటే తక్కువ అయితే, కంపెనీ ఉచితంగా బ్యాటరీని మార్చి ఇస్తుంది.

Go వేరియంట్ లో 33.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉండగా, Plus వేరియంట్ లో 27.2 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. 580W ఛార్జర్‌తో Go వేరియంట్ బ్యాటరీ 3 గంటల 53 నిమిషాల్లో, Plus వేరియంట్ బ్యాటరీ 5 గంటల 39 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా బ్యాటరీని 0 నుండి 80% వరకు కేవలం 1 గంటలో, 100% ఛార్జ్ 2 గంటల్లో చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే, Go వేరియంట్ లో 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే ఉండగా, Plus వేరియంట్ లో 4.3 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వస్తుంది. ఈ రెండు మోడల్స్‌లో బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ , OTA ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ , రిమోట్ ఇమ్మొబిలైజేషన్, కాల్/SMS అలర్ట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడల్స్‌లో కాంబీ బ్రేకింగ్, సింగిల్ డిస్క్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories