Hyundai IONIQ 5: వావ్.. వండర్‌ఫుల్.. హ్యుందాయ్ కారుపై రూ. 4 లక్షల డిస్కౌంట్.. ఇవిగో ఫుల్ డీటెయిల్స్..!

Hyundai IONIQ 5
x

Hyundai IONIQ 5: వావ్.. వండర్‌ఫుల్.. హ్యుందాయ్ కారుపై రూ. 4 లక్షల డిస్కౌంట్.. ఇవిగో ఫుల్ డీటెయిల్స్..!

Highlights

Hyundai IONIQ 5: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయోనిక్ 5పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాహనం 2024 మోడల్‌పై రూ. 4 లక్షల పెద్ద తగ్గింపు అందిస్తుంది.

Hyundai IONIQ 5: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయోనిక్ 5పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాహనం 2024 మోడల్‌పై రూ. 4 లక్షల పెద్ద తగ్గింపు అందిస్తుంది. కంపెనీ తన మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ తగ్గింపును ఇస్తోంది. అయోనిక్ 5 జనవరి 2023లో రూ. 44.95 లక్షలతో విడుదలైంది. అప్పటి నుండి దాని ధర రూ. 46.05 లక్షలకు పెరిగింది. ఇప్పుడు ఈ ఆఫర్‌తో దీని ధర రూ.42.05 లక్షలకు తగ్గింది. మీరు కూడా ఈ కొత్త కారు కొనాలి ఆలోచిస్తుంటే.. ఫీచర్స్, ఆఫర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ అయోనిక్ 5‌లో 72.6కిలోవాట్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 217 బిహెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ కూడా ఉత్పత్తి చేస్తుంది. 21 నిమిషాల్లో 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 50 కిలోవాట్ ఛార్జర్ ద్వారా పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1 గంట పడుతుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 పొడవు 4634 మిమీ, వెడల్పు 1890 మిమీ, ఎత్తు 1625 మిమీ. దీని వీల్ బేస్ 3000మిమీ.

హ్యుందాయ్ అయోనిక్ 5‌ ఈ ఎలక్ట్రిక్ కారులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా,అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులోని అధునాతన ఫీచర్లు, రేంజ్ దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. రోజువారీ వినియోగానికి అలానే దూర ప్రయాణాలకు ఇది మంచి కారు.

Show Full Article
Print Article
Next Story
More Stories