2025 Hyundai Exter: సరికొత్త ఫీచర్లతో మిడిల్ క్లాస్ బడ్జెట్ కారు

Hyundai Motors launched subcompact SUV EXter car with updated features
x

2025 Hyundai Exter: సరికొత్త ఫీచర్లతో మిడిల్ క్లాస్ బడ్జెట్ కారు

Highlights

2025 Hyundai Exter: దేశంలోని కార్ల తయారీ సంస్థ హ్యందాయ్ మోటర్స్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది....

2025 Hyundai Exter: దేశంలోని కార్ల తయారీ సంస్థ హ్యందాయ్ మోటర్స్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ అప్‌డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కస్టమర్లకు కొత్తదనాన్ని అందించడానికి కొత్త ఎక్స్‌టర్‌ కారులో చాలా మంచి ఫీచర్లను అందించింది. ఎక్స్‌టర్ ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.773190 నుండి ప్రారంభమవుతాయి. కొత్త ఫీచర్లతో కస్టమర్ల డ్రైవింగ్ అనుభవం మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనంలో అందుబాటులో ఉన్న ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ లుక్ కస్టమర్లను ఆకర్షించేలా ఉంటుంది. అంతేకాకుండా కారు అమ్మకాలు కూడా బాగున్నాయి. ఈ కారు పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ పెట్రోల్, హై సిఎన్‌సి డుయోలో ఉన్న కొత్త SX టెక్ వేరియంట్లో ఇప్పుడు కొన్ని అదనపు ఫీచర్లు చేర్చారు. స్టార్ట్/స్టాప్‌ పుష్-బటన్, స్మార్ట్ కీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇవే కాకుండా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా Exter S+ పెట్రోల్ వేరియంట్ కూడా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వెనుక కెమెరా, వెనుక AC వెంట్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ స్టైల్ స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయింది.

హ్యుందాయ్ ఇప్పుడు ఎక్స్‌టర్ S పెట్రోల్ వేరియంట్‌లో వెనుక పార్కింగ్ కెమెరా, అప్‌గ్రేడ్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లను చేర్చింది. హ్యుందాయ్ సిఎన్‌జిలో ఎస్ ఎగ్జిక్యూటివ్, ఎస్+ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లను కూడా పరిచయం చేసింది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఎక్స్‌టర్ నేరుగా టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌తో పోటీపడుతుంది. కంపెనీ కారును గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫామ్‌లో డెవలప్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories