Upcoming EVs in March: రాజ్యమేలనున్న ఈవీ కార్లు.. ఎంజీ సైబర్‌స్టర్, కియా ఈవీ6 వచ్చేస్తున్నాయ్..!

Upcoming EVs in March: రాజ్యమేలనున్న ఈవీ కార్లు.. ఎంజీ సైబర్‌స్టర్, కియా ఈవీ6 వచ్చేస్తున్నాయ్..!
x
Highlights

Upcoming EVs in March: ఈ నెలలో భారత్‌లో చాలా కార్లు విడుదల కానున్నాయి, అయితే రెండు కార్లు చాలా ప్రత్యేకమైనవి.. ఎంజీ సైబర్‌స్టర్, కియా ఈవీ6 ఈ నెలలో కార్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి.

Upcoming EVs in March: ఈ నెలలో భారత్‌లో చాలా కార్లు విడుదల కానున్నాయి, అయితే రెండు కార్లు చాలా ప్రత్యేకమైనవి.. ఎంజీ సైబర్‌స్టర్, కియా ఈవీ6 ఈ నెలలో కార్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ సంవత్సరం, ఈ రెండు కార్లను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. ఈ రెండు కార్ల ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

MG Cyberster

ఎంజీ సైబర్‌స్టర్ ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. ఈ కారు డిజైన్, ఫీచర్లు చాలా మందిని ఆకర్షించాయి. ఇది ఎంజీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ కారు. సైబర్‌స్టర్‌‌లో 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఈ కారు సంభార్ సాల్ట్ లేక్ వద్ద కేవలం 3.2 సెకన్ల వ్యవధిలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. ఈ ఈవీ 510 పిఎస్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ నెలలో దేశీయ మార్కెట్లోకి రానుంది. సైబర్‌స్టర్ అంచనా ధర రూ. 50 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ కారు ఎంజీ ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది.

2025 Kia EV6

కియా ఇండియా తన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలో విడుదల చేయబోతోంది. ఈ కొత్త మోడల్‌లో అనేక కొత్త మార్పులను చూడచ్చు. ఈ కారులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీని ఇంటీరియర్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, అప్‌డేట్ చేసిన సెంటర్ కన్సోల్ ఉన్నాయి. 2025 ఈవీ6లో 84 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది, ఇది 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందించగలదు. ఈ కారు అంచనా ధర రూ. 63 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభం కావచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories