
టాటా ఈవీలకు చెక్ పెట్టేందుకు కియా నయా ఈవీ రెడీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Kia Syros EV : భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు కొరియన్ కార్ల దిగ్గజం కియా సిద్ధమవుతోంది. ఇప్పటికే తన ప్రీమియం ఈవీ మోడళ్లతో ఆకట్టుకున్న కియా, ఇప్పుడు మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కియా సైరోస్ ఈవీని తీసుకువస్తోంది. తాజాగా ఈ కారు భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. 2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తిగా భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇక్కడే డిజైన్ చేస్తుండటం విశేషం.
డిజైన్ విషయానికి వస్తే.. టెస్టింగ్ సమయంలో ఈ కారును పూర్తిగా కవర్ చేసినప్పటికీ కొన్ని కీలక ఫీచర్లు బయటపడ్డాయి. దీని పెట్రోల్ వేరియంట్ సైరోస్తో పోలిస్తే ఈవీ మోడల్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. ముందు భాగంలో సరికొత్త ఎల్ఈడీ లైటింగ్, రీడిజైన్ చేసిన బంపర్ లేఅవుట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ కార్లలో సాధారణంగా కనిపించే ఏరోడైనమిక్ వీల్ డిజైన్‌ను ఇందులో గమనించవచ్చు. కారు వెనుక భాగంలో కూడా కొత్త ల్యాంప్ డిజైన్ మరియు ఈవీ బ్యాడ్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియాకు పెద్ద బూస్ట్ ఇచ్చేలా ఉంది.
ఈ కారు ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రెయిన్ గురించి ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. సైరోస్ ఈవీ కోసం కియా తన సొంత ఈవీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కారుకు లోపల ఎక్కువ స్థలం లభించడమే కాకుండా పెట్రోల్ కార్ల నుంచి దీనికి ఒక విభిన్నమైన గుర్తింపు లభిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారులో 42 kWh, 49 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. అంటే సిటీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ జర్నీలకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది.
కియా తన ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను ఇండియాలో భారీగా విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగానే సైరోస్ ఈవీని 2026 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ ఈ-సి3 వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి కియా నుంచి రాబోయే ఈ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు కోసం ఈవీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




