Mahindra Bolero Bold Edition: సూపర్ హిట్.. సరికొత్తగా మహీంద్రా బొలెరో.. బాహుబలిని మించి పోతుంది..!

Mahindra Bolero Bold Edition
x

Mahindra Bolero Bold Edition: సూపర్ హిట్.. సరికొత్తగా మహీంద్రా బొలెరో.. బాహుబలిని మించి పోతుంది..!

Highlights

Mahindra Bolero Bold Edition: దేశంలోని ప్రముఖ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రసిద్ధ మోడళ్లు బొలెరో, బొలెరో నియోలలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

Mahindra Bolero Bold Edition: దేశంలోని ప్రముఖ ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రసిద్ధ మోడళ్లు బొలెరో, బొలెరో నియోలలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్‌కు కంపెనీ బోల్డ్ ఎడిషన్ అని పేరు పెట్టింది. కొత్త బొలెరో బోల్డ్, బొలెరో నియో బోల్డ్‌లలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేశారు ఇది సాధారణ మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం, మెరుగ్గా ఉంటుంది.

మహీంద్రా బొలెరో బోల్డ్ ఎడిషన్‌లో కొన్ని ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ టూల్స్ చేర్చారు. అవుట్ లుక్ గురించి మాట్లాడుకుంటే, నల్లటి బంపర్లపై ముదురు రంగు క్రోమ్ పార్ట్స్ కనిపిస్తాయి. దీనితో పాటు, క్యాబిన్‌లో కొత్త నల్లటి సీట్ కవర్లు అందించారు. ఇవి లేత గోధుమరంగు లోపలికి బాగా సరిపోతాయి. అయితే, ఈ ప్యాకేజీ ఏ వేరియంట్‌తో అందించబడుతుందనే దాని గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. దీనితో పాటు, ధరలు ఇంకా వెల్లడించలేదు, కానీ ఈ ప్యాకేజీ స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. 30,000 ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు

ఈ కొత్త బోల్డ్ ఎడిషన్ మహీంద్రా బొలెరోలో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇది మునుపటిలాగే అదే 1.5-లీటర్, మూడు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను పొందుతూనే ఉంటుంది. ఈ ఇంజన్ 75బిహెచ్‌పి పవర్, 210 న్యూటన్ మీటర్ (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది.

మహీంద్రా బొలెరో గత 25 సంవత్సరాలుగా భారత మార్కెట్లో అద్భుతంగా పనిచేస్తోంది. దాని పవర్, పర్ఫామెన్స్ కారణంగా, ఈ ఎస్‌యూవీ భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇది కాకుండా, ఇది భారతీయ మార్కెట్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ దీనిని మొదటిసారిగా ఆగస్టు 2000లో ప్రారంభించింది. ఇప్పటివరకు దీనిని చాలాసార్లు అప్డేట్ చేశారు.

జూలై 2021లో, కంపెనీ బొలెరో నియోను బొలెరో ప్రీమియం వెర్షన్‌గా ప్రారంభించింది. నిజానికి ఇది TUV 300 మోడల్, ఇది మార్కెట్లో బాగా రాణించలేకపోయింది. కానీ బొలెరో నేమ్‌ప్లేట్‌తో ప్రవేశపెట్టిన తర్వాత, ఈ ఎస్‌యూవీ పట్టణ ప్రాంతాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం, మహీంద్రా బొలెరో క్లాసిక్ మోడల్ ధర రూ. 9.79 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, బొలెరో నియో ధర రూ. 9.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories