Mahindra Scorpio N: ఈ కారే కావాలి అంటున్న ప్రజలు.. జోరుగా సేల్స్

Mahindra Scorpio N Ranks 7th in the Top-10 Cars Sold in January 2025
x

Mahindra Scorpio N: ఈ కారే కావాలి అంటున్న ప్రజలు.. జోరుగా సేల్స్

Highlights

Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో N దేశీయ మార్కెట్‌లో అత్యంత ఫేమస్ ఎస్‌యూవీ.

Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో N దేశీయ మార్కెట్‌లో అత్యంత ఫేమస్ ఎస్‌యూవీ. నగరాల నుండి పల్లెటూర్ల వరకు ఈ వాహనానికి విపరీతమైన క్రేజ్ ఉంది. కొత్త సంవత్సరం స్కార్పియో కంపెనీకి అద్భుతమైన బహుమతులు తెచ్చిపెట్టింది. స్కార్పియో జనవరి 2025లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ వాహనంగా నిలిచింది. ఈ కారు పవర్‌ఫుల్ ఇంజన్, అధునాతన ఫీచర్ల కారణంగా సేల్స్‌లో దూసుకుపోతుంది.

మహీంద్రా ఇటీవల జనవరిలో విక్రయించిన కార్ల లెక్కలను విడుదల చేసింది. గత నెలలో స్కార్పియో, స్కార్పియో-ఎన్ కార్లు 15,442 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరిలో అమ్ముడైన టాప్-10 కార్లలో స్కార్పియో 7వ స్థానంలో నిలిచింది. మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రస్తుతం దేశంలోని ఫేవరెట్ ఎస్‌యూవీలలో ఒకటి. కారు లుక్ చాలా బోల్డ్, ప్రీమియంగా ఉంటుంది. కారు ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 24.69 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు డిజైన్ విషయానికొస్తే... ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో పాటు రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, C షేప్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆకర్షణీయమైన డాష్,సెంటర్ కన్సోల్‌తో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తోంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ కెమెరా ఉన్నాయి. ఇవే కాకుండా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ డిస్క్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కారు GNCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను సాధించింది. మహీంద్రా స్కార్పియో-Nలో థార్, XUV700లో ఉండే ఇంజన్ ఉంటుంది. ఇందులో 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ mStallion పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-N టాప్-ఎండ్ వేరియంట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) టెక్నాలజీ ఉంది. ఈ SUV సుమారు 14 నుండి 18.5 KMPL మైలేజీని ఇస్తుంది. దేశీయ విపణిలో ఈ SUV టాటా హారియర్, సఫారీ వంటి వాహనాలతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories