Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ షురూ.. ఏయే కార్లో తెలుసా ?

Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ షురూ.. ఏయే కార్లో తెలుసా ?
x

Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల డెలివరీ షురూ.. ఏయే కార్లో తెలుసా ?

Highlights

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అయిన BE 6, XEV 9eల ప్యాక్ టూ వేరియంట్‌ల డెలివరీలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది.

Mahindra : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అయిన BE 6, XEV 9eల ప్యాక్ టూ వేరియంట్‌ల డెలివరీలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ మిడ్-స్పెక్ మోడళ్లు అడ్వాన్సుడ్ ఫీచర్లు, పవర్ఫుల్ పర్ఫామెన్స్ లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే వీటి హై-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ల డెలివరీలను మార్చి, జూన్ 2025లో మొదలుపెట్టారు.

ఈ రెండు మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మహీంద్రా బీఈ 6 59 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.22.65 లక్షలు కాగా, 79 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.24.25 లక్షలు. ఇక మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ విషయానికి వస్తే, 59 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.25.65 లక్షలు, 79 kWh బ్యాటరీ వెర్షన్ ధర రూ.27.25 లక్షలు.

ఈ కార్లలోని బ్యాటరీ ఆప్షన్లకు అనుగుణంగా రేంజ్, పవర్ అవుట్‌పుట్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 79 kWh బ్యాటరీతో కూడిన బీఈ 6 ఒక పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 682 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. అదే బ్యాటరీతో ఉన్న ఎక్స్‌ఈవీ 9ఈ రేంజ్ 656 కిలోమీటర్లుగా ఉంది. 59 kWh బ్యాటరీతో, బీఈ 6 రేంజ్ 535 కిలోమీటర్లు అయితే, ఎక్స్‌ఈవీ 9ఈ రేంజ్ 542 కిలోమీటర్లు.

ఈ కార్ల పవర్ అవుట్‌పుట్ కూడా బ్యాటరీ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. 79 kWh బ్యాటరీ వెర్షన్ 282 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 59 kWh బ్యాటరీ వెర్షన్ 228 bhp పవర్‌ను ఇస్తుంది. ఈ రెండు వేరియంట్‌లలోనూ 380 Nm టార్క్ లభిస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

మహీంద్రా బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ కార్లు డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, రాత్రి పూట వెలిగే లోగో దీనికి హైలైట్‌. రెండు కార్లలోనూ లెదరెట్ అప్హోల్స్టరీని ఉపయోగించారు. బీఈ 6లో రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉండగా, ఎక్స్‌ఈవీ 9ఈలో మూడు స్క్రీన్‌ల లేఅవుట్ ఉంది. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.

సురక్షితమైన ప్రయాణం కోసం ఈ రెండు కార్లలో అత్యున్నత సేఫ్టీ ఫీచర్లను చేర్చారు. 6 ఎయిర్‌బ్యాగ్స్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 4 చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, రియర్-వ్యూ కెమెరా, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్-2 ఏడీఏఎస్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ ఫెటీగ్ వార్నింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహీంద్రా ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories