2025 Mahindra Thar Roxx: ఆఫ్‌రోడ్‌ మాన్‌స్టర్‌కి ఫ్యామిలీ టెస్ట్‌.. థార్ ఎలా ఉందంటే..?

2025 Mahindra Thar Roxx: ఆఫ్‌రోడ్‌ మాన్‌స్టర్‌కి ఫ్యామిలీ టెస్ట్‌.. థార్ ఎలా ఉందంటే..?
x

2025 Mahindra Thar Roxx: ఆఫ్‌రోడ్‌ మాన్‌స్టర్‌కి ఫ్యామిలీ టెస్ట్‌.. థార్ ఎలా ఉందంటే..?

Highlights

మహీంద్రా థార్‌ రాక్స్‌ అనే పేరు వినబడగానే... పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో రఫ్‌ రోడ్లను చీల్చుకుంటూ సాగిపోయే SUV ఇమేజ్‌ మన కళ్ల ముందు నుంచి దూసుకెళ్తుంది.

2025 Mahindra Thar Roxx: మహీంద్రా థార్‌ రాక్స్‌ అనే పేరు వినబడగానే... పవర్‌ఫుల్‌ ఇంజిన్‌తో రఫ్‌ రోడ్లను చీల్చుకుంటూ సాగిపోయే SUV ఇమేజ్‌ మన కళ్ల ముందు నుంచి దూసుకెళ్తుంది. కానీ, ఈ సారి దీనిని కాస్త వేరే యాంగిల్‌లో, ఫ్యామిలీ యూజ్‌ కోసం పరీక్షించారు. ఓ కుటుంబం, ఉత్తర భారతదేశంలో 16,000 కి.మీ. డ్రైవింగ్‌ చేసిన తర్వాత 2025 థార్‌ రాక్స్‌ ఎలా ఉందో వివరాలు వెల్లడించింది. వారు చెప్పిన మాటల్లో మొదటిది - ఇది చాలా రిఫైన్‌గా ఉంది. 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ స్మూత్‌గా, పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. కానీ 100 kmph స్పీడ్‌ లిమిట్‌లో డ్రైవ్‌ చేయడం కాస్త చికాకే. తక్కువ థ్రాటిల్‌తో నడపాల్సి రావడం వల్ల డ్రైవర్‌కి చిన్న అసహనం కలుగుతుంది.

మైలేజ్‌ కూడా సగటు స్థాయిలోనే ఉంది, లీటరుకు 11.8 km ఇచ్చింది. ఒక హెవీ 4x4 SUVకి ఇదేమీ చిన్న నంబర్‌ కాదు గానీ, ఫ్యామిలీ SUV దృష్టితో ఆలోచిస్తే కాస్త తక్కువ నంబరే. 2025 థార్‌ రాక్స్‌కు వర్షాకాలంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వెనుక కెమెరా మీద మట్టి త్వరగా చేరుతోంది. ముందు వీల్‌ ఆర్చ్‌ గ్యాప్‌ వల్ల డోర్ల మీద వరకూ నీరు ఎగసిపడుతోంది. వైపర్లు కూడా పూర్తి క్లియర్‌ విజిబిలిటీ ఇవ్వలేదు, అలాగే నిలువుగా ఉన్న విండ్‌షీల్డ్‌ వల్ల నీరు గాజు మీదనే అంటుకుని ఉంటుంది.

సస్పెన్షన్‌ సెటప్‌ హార్డ్‌గా ఉంది. చిన్న బంప్స్‌ దగ్గర బాడీ మోషన్‌ ఎక్కువగా ఉంటుంది, కానీ పెద్ద గుంతలు దాటేటప్పుడు మాత్రం థార్‌ సూపర్‌గా పని చేస్తుంది. ఇంటీరియర్‌ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంది. Harman/Kardon సౌండ్‌ సిస్టమ్‌ ఒక హైలైట్‌. ఇది గల్జరీ కార్లలో ఉన్న సిస్టమ్‌లకు సమానమైన ఫీల్‌ ఇస్తుంది. 447 లీటర్ల బూట్‌ స్పేస్‌ కూడా ఫ్యామిలీ ట్రిప్‌కి సరిపోతుంది. ఒక చెక్‌-ఇన్‌ బ్యాగ్‌, మూడు బాక్స్‌లు, ఒక డఫిల్‌ బ్యాగ్‌, బ్యాక్‌ప్యాక్‌, మ్యాట్రెస్‌ అన్నీ సులభంగా పెట్టొచ్చు. అయితే డోర్‌ పాకెట్లు చాలా చిన్నవిగా ఉండటం ఒక మైనస్‌.

16,000 కి.మీ.లో థార్‌ రాక్స్‌ మనకు చూపించింది ఏమిటంటే - ఇది కేవలం ఆఫ్‌రోడ్‌ బీస్ట్‌ కాదు, కొంతవరకు ఫ్యామిలీ SUVగానూ ఉపయోగించవచ్చు. అయితే ప్రతిరోజు సిటీ డ్రైవ్‌కి ఇది ఫస్ట్‌ ఆప్షన్‌ మాత్రం కాదు. ఈ బండి బాడీ మూవ్‌మెంట్‌, వెయిట్‌, స్పీడ్‌ లిమిట్స్‌ కారణంగా సిటీ రైడ్‌లో కాస్త అలసట కలిగిస్తుంది. కానీ మీరు ఆఫ్‌రోడ్‌ ఫ్యాన్‌ అయితే, ఈ SUV ఇచ్చే కూల్‌ ఇమేజ్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మొత్తంగా, 2025 Mahindra Thar Roxx “రఫ్‌ అండ్‌ రాయల్‌” అనుభవం ఇస్తుంది, కానీ రోజువారీ SUVగా తీసుకోవాలంటే కాస్త ఆలోచించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories