Maruti Alto K10: చౌకైన కారు.. ధర పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు

Maruti Alto K10 11,352 units sold in January 2025
x

Maruti Alto K10: చౌకైన కారు.. ధర పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు

Highlights

Maruti Alto K10: మారుతి సుజుకి ఆల్టో కె10 దేశీయ విపణిలో అత్యంత చౌకైన కారు. తక్కువ ధరలో వచ్చే ఈ చిన్న కారు అధిక మైలేజీని ఇస్తుంది. మారుతి కంపెనీ ఇటీవల...

Maruti Alto K10: మారుతి సుజుకి ఆల్టో కె10 దేశీయ విపణిలో అత్యంత చౌకైన కారు. తక్కువ ధరలో వచ్చే ఈ చిన్న కారు అధిక మైలేజీని ఇస్తుంది. మారుతి కంపెనీ ఇటీవల ఈ కారు ధరను పెంచింది. అయినప్పటికీ ఈ హ్యాచ్‌బ్యాక్‌కు బంపర్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కారు అమ్మకాలు, ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

భారత మార్కెట్లో ఆల్టో కె10కి డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంది. జనవరి 2025లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ 11,352 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి ఇతర ఎస్-ప్రెస్సో, సెలెరియో, జిమ్నీ కార్లతో పోలిస్తే వినియోగదారులు ఆల్టోని ఎక్కువగా కొంటున్నారు.

దేశీయ మార్కెట్లో మారుతి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్‌ ధర ఇప్పుడు రూ. 4.09 లక్షల నుండి రూ. 6.05 లక్షల వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ STD, LXI, VXI, VXI Plus అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో K10లో ఆరు కలర్ ఆప్షన్స్‌లు ఉన్నాయి. అందులో స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్, సిజ్లింగ్ రెడ్, సిల్కీ వైట్, సాలిడ్ వైట్, గ్రానైట్ గ్రే కలర్స్‌ను చూడొచ్చు.

మారుతి సుజుకి ఆల్టో కె10లో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 67 పిఎస్ పవర్, 89 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ఇట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కారులో అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో K10 CNG పవర్‌ట్రెయిన్‌‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ సిఎన్‌జి ఇంజన్ 57 పిఎస్ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందించారు. ఈ వాహనంలో ఐడిల్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ ఫీచర్ ఉంది.

మారుతి సుజుకి ఆల్టో K10 మైలేజీ విషయానికొస్తే.. పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.39 kmpl, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 24.90 kmpl మైలేజీని అందిస్తుంది. అయితే, CNG మోడల్ 33.85 km/kg వరకు మైలేజీని ఇవ్వగలదు.

మారుతి ఆల్టో K10 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories