Toyoto: టయోటా రూమియన్ కొనే వారికి షాక్.. భారీగా పెరిగిన ధర..!

Maruti Ertiga Rival Gets Expensive Toyota Rumion Price Increase Announced
x

Toyoto: టయోటా రూమియన్ కొనే వారికి షాక్.. భారీగా పెరిగిన ధర..!

Highlights

Toyoto: టయోటా సంస్థ 2025 ప్రారంభంలోనే కొన్ని రూమియన్ వేరియంట్ల ధరలను సవరించింది.

Toyoto: టయోటా సంస్థ 2025 ప్రారంభంలోనే కొన్ని రూమియన్ వేరియంట్ల ధరలను సవరించింది. ధరలో గరిష్టంగా రూ.10వేలపెరుగుదల ఉంది. శాతం పరంగా ఇది 0.96% వరకు పెరుగుదల. వేరియంట్ల వారీగా ధరల పెరుగుదల వివరాలు ఇలా ఉన్నాయి.

1.5 లీటర్ పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లలో S వేరియంట్ పాత ధర రూ.10,44,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.10,54,000కి చేరింది. ఇది 0.96శాతం పెరుగుదల. G వేరియంట్ పాత ధర రూ.11,60,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.11,70,000 అయింది. ఇది 0.86% పెరుగుదల. V వేరియంట్ పాత ధర రూ.12,33,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.12,43,000 అయింది. ఇది 0.81% పెరుగుదల.

1.5 లీటర్ పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్లలో S వేరియంట్ పాత ధర రూ.11,94,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.12,04,000 అయింది. ఇది 0.84% పెరుగుదల. G వేరియంట్ పాత ధర రూ.13,00,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.13,10,000 అయింది. ఇది 0.77% పెరుగుదల. V వేరియంట్ పాత ధర రూ.13,73,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.13,83,000 అయింది. ఇది 0.73% పెరుగుదల.

1.5 లీటర్ సీఎన్‌జీ-మాన్యువల్ వేరియంట్‌లో S వేరియంట్ పాత ధర రూ.11,39,000 ఉండగా, రూ.10,000 పెరిగి ఇప్పుడు రూ.11,49,000 అయింది. ఇది 0.88% పెరుగుదల.

ధరల పెరుగుదలకు టయోటా సంస్థ అధికారికంగా ఎటువంటి కారణం చెప్పలేదు. కానీ, ఆటో పరిశ్రమలో ఉన్న ట్రెండ్‌లను బట్టి చూస్తే, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, కొత్త భద్రతా ఫీచర్లు లేదా మార్కెట్ వ్యూహం వంటి కారణాలు ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories