Maruti S-Presso Discount : బైక్ ధరకే కారు..పైగా రూ.37,500 తగ్గింపు..మిస్సయితే పశ్చాత్తాపడతారు

Maruti S-Presso Discount : బైక్ ధరకే కారు..పైగా రూ.37,500 తగ్గింపు..మిస్సయితే పశ్చాత్తాపడతారు
x
Highlights

బైక్ ధరకే కారు..పైగా రూ.37,500 తగ్గింపు..మిస్సయితే పశ్చాత్తాపడతారు

Maruti S-Presso Discount : బైక్ కొనే ధరలో కారు రావాలని కలలు కంటున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ ఎస్-ప్రెస్సో పై ఫిబ్రవరి 2026లో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఎస్‌యూవీ లాంటి లుక్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే ఈ బుజ్జి కారు ఇప్పుడు మరింత చౌకగా లభిస్తోంది. ఫిబ్రవరి 2026 నెలలో మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ కారు ఎస్-ప్రెస్సోపై కస్టమర్లకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలలో గనుక కారు కొంటే ఏకంగా రూ.37,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ కింద రూ.10,000 వరకు, పాత కారును మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15,000 నుంచి రూ.25,000 వరకు లభిస్తుంది. అంతేకాకుండా కార్పొరేట్ ఉద్యోగులకు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి అదనంగా మరో రూ.2,100 నుంచి రూ.2,500 వరకు రాయితీ లభించే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు పెట్రోల్, సీఎన్‌జీ రెండు వేరియంట్లపై అందుబాటులో ఉన్నాయి.

మారుతి ఎస్-ప్రెస్సోను ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. లోపల కూర్చునే వారికి మంచి వ్యూ కనిపిస్తుంది, అందుకే దీనిని మినీ ఎస్‌యూవీ అని కూడా పిలుస్తారు. టౌన్లలో ట్రాఫిక్ మధ్య ఈ కారును నడపడం చాలా సులభం. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నికనిచ్చే కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ కారుకు ఉన్న అతిపెద్ద బలం దాని మైలేజ్. పెట్రోల్ మోడల్ సుమారు 24-25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్ ఏకంగా కిలోకు 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకు వెళ్లే వారికి లేదా చిన్న ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ కారు వల్ల ఇంధన ఖర్చులు బాగా తగ్గుతాయి. మారుతి సుజుకి బ్రాండ్ వాల్యూ, సర్వీస్ నెట్‌వర్క్ దీనికి అదనపు బలాన్ని ఇస్తాయి.

మారుతి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర ప్రస్తుతం రూ.3.49 లక్షల నుంచి రూ.5.25 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మీరు ఎంచుకునే మోడల్ , మీరు ఉండే నగరాన్ని బట్టి ఈ ధరల్లో, డిస్కౌంట్లలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని మారుతి ఎరీనా డీలర్‌ను సంప్రదించి, పూర్తి ఆన్-రోడ్ ధర, అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వాకబు చేయడం మంచిది. ఆల్టో K10, రెనాల్ట్ క్విడ్ వంటి కార్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ఎస్-ప్రెస్సో ఇప్పుడున్న ఆఫర్లతో మార్కెట్లో దుమ్మురేపడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories