Maruti Suzuki E Vitara: దేశం ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. జస్ట్ రూ.25 వేలు ఉంటే చాలు..!

Maruti Suzuki E Vitara
x

Maruti Suzuki E Vitara: దేశం ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. జస్ట్ రూ.25 వేలు ఉంటే చాలు..!

Highlights

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకి ఈ విటారా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను మే 19న విడుదల చేయనుంది.

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకి ఈ విటారా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను మే 19న విడుదల చేయనుంది. అయితే ఈ విషయంలో కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టారు. కొన్ని డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌కు సంబంధించి కంపెనీ నుండి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ కారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

కొత్త ఈ విటారాలో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఇందులో 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. దీని పరిధి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. ఈ విటారాను గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేశారు. అక్కడి నుండి జపాన్, యూరప్‌లకు ఎగుమతి చేయచ్చు. నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనుంది.

దీని ధర సుమారు రూ. 17 నుండి 20 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉండచ్చు. కొత్త ఈ విటారా నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ సింగిల్-టోన్‌తో స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్-టోన్ కలర్స్‌తో బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో అందించారు.

కొత్త ఈ విటారా పొడవు 4,275ఎమ్ఎమ్, వెడల్పు 1,800ఎమ్ఎమ్, ఎత్తు 1,635ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,700ఎమ్ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 180ఎమ్ఎమ్. R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తాయి. ఇది కాకుండా, ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ వెంట్‌లు, స్థిర పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories