
మారుతి షోరూమ్‌ల దగ్గర క్యూ కట్టాల్సిందే.. స్విఫ్ట్ కారుపై ఊహించని ఆఫర్
Maruti Suzuki Swift : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా స్టైలిష్‌గా ఉండి, మైలేజ్ అదిరిపోయే కారు కావాలా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ పై ఫిబ్రవరి 2026లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. ఇప్పుడు గనుక మీరు కారు కొంటే ఏకంగా రూ.45,000 వరకు నేరుగా ఆదా చేసుకోవచ్చు. మారుతి సుజుకి తన కార్ల శ్రేణిలో స్విఫ్ట్‌ను ఒక ఐకానిక్ మోడల్‌గా తీర్చిదిద్దింది. ఫిబ్రవరి 2026 నెలలో ఈ కారుపై కంపెనీ తన మిగతా మోడళ్ల కంటే ఎక్కువ డిస్కౌంట్లను ఇస్తోంది. గరిష్టంగా రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో నేరుగా లభించే క్యాష్ డిస్కౌంట్, పాత కారును మార్చుకునే వారికి ఇచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు కార్పొరేట్ ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక ఆఫర్లు కలిసి ఉన్నాయి. మీరు ఎంచుకునే వేరియంట్ (LXi, VXi, ZXi) బట్టి ఈ ఆఫర్ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏజీఎస్ (AGS - ఆటోమేటిక్) మోడల్ కొనేవారికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
భారతీయ మార్కెట్లో మారుతి స్విఫ్ట్ అంటే తెలియని వారు ఉండరు. దీని స్పోర్టీ లుక్, గంభీరమైన బాడీ స్ట్రక్చర్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అదే సమయంలో నలుగురు లేదా ఐదుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్‌గా మారింది. కేవలం సిటీ డ్రైవింగ్ మాత్రమే కాకుండా, హైవేలపై కూడా ఈ కారు ప్రయాణం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ కాబట్టి, దీర్ఘకాలంలో ఈ కారు కొనడం వల్ల ఎంతో లాభం ఉంటుంది.
మారుతి కార్లు అంటేనే మైలేజీకి పెట్టింది పేరు. స్విఫ్ట్ కూడా ఇందులో ఏమాత్రం తక్కువ కాదు. పెట్రోల్ వేరియంట్లలోనే కాకుండా సీఎన్జీ ఆప్షన్లో కూడా ఇది లభిస్తోంది. లీటరు పెట్రోల్‌కు సుమారు 24-25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుండటంతో పెట్రోల్ ఖర్చులు భరించలేని వారికి ఇది వరం లాంటిది. స్విఫ్ట్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ చాలా వేగంగా ఉంటుంది, అందుకే దీనిని ఫన్-టు-డ్రైవ్ కారు అని పిలుస్తారు.
మారుతి సుజుకి ఇస్తున్న ఈ రూ.45,000 ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీరు ఉండే నగరం, మీరు వెళ్ళే డీలర్‌షిప్‌ను బట్టి ఈ డిస్కౌంట్లలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. కాబట్టి, కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని మారుతి ఎరీనా షోరూమ్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి కార్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ, మారుతి స్విఫ్ట్ తనకున్న క్రేజ్, ఇప్పుడున్న ఆఫర్లతో మళ్ళీ నంబర్ 1 స్థానానికి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




