MG Cyberster: ఎలక్ట్రిక్ కార్లలో కొత్త కింగ్.. ఆరు నెలల్లోనే రికార్డ్ బ్రేకింగ్ సేల్స్..!

MG Cyberster: ఎలక్ట్రిక్ కార్లలో కొత్త కింగ్.. ఆరు నెలల్లోనే రికార్డ్ బ్రేకింగ్ సేల్స్..!
x

MG Cyberster: ఎలక్ట్రిక్ కార్లలో కొత్త కింగ్.. ఆరు నెలల్లోనే రికార్డ్ బ్రేకింగ్ సేల్స్..!

Highlights

MG Cyberster: ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ మయం అవుతోంది. తక్కువ ఖర్చు, అదిరిపోయే ఫీచర్లతో ఈవీలు కస్టమర్లను ఊరిస్తున్నాయి.

MG Cyberster: ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ మయం అవుతోంది. తక్కువ ఖర్చు, అదిరిపోయే ఫీచర్లతో ఈవీలు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్స్ 2025లో లాంచ్ చేసిన 'MG సైబర్‌స్టర్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఆరు నెలల కాలంలోనే 500 కి పైగా యూనిట్లు అమ్ముడై ఈ విభాగంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇండియాలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 74.99 లక్షలుగా ఉంది.

ఈ కారు కేవలం చూడటానికే కాదు, పనితీరులో కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 77 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 507 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, 144 kW ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 38 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం ఈ కారు 510 PS శక్తిని, 725 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 195 కిలోమీటర్లు. అంటే రోడ్డుపై ఇది చిరుతపులిలా దూసుకెళ్తుందన్నమాట! కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా ఇందులో వెనుక చక్రాల డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్అనే రెండు ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. స్పోర్ట్స్ కార్ ప్రియులకు ఇది ఒక కలల కారులా అనిపిస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఎంజీ సైబర్‌స్టర్ ఒక టెక్నాలజీ హబ్ అని చెప్పాలి. ఇందులో 10.25-అంగుళాల వర్చువల్ క్లస్టర్, 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు డ్రైవర్ కోసం ప్రత్యేకంగా మరో టచ్‌స్క్రీన్‌ను కేటాయించారు. మ్యూజిక్ లవర్స్ కోసం అదిరిపోయే బోస్ సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన Y-ఆకారపు స్పోర్ట్స్ సీట్లు దీని సొంతం. 19 నుంచి 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు ఒక రాయల్ లుక్‌ను తీసుకొచ్చాయి.

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ హుడ్ సిస్టమ్ ఇందులో ఉంది. స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్స్, ఎకో-ఫ్రెండ్లీ పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఎంజీ సైబర్‌స్టర్‌ను లగ్జరీ ఈవీ మార్కెట్లో టాప్‌లో నిలబెట్టాయి. అందుకే లాంచ్ అయిన తక్కువ టైమ్ లోనే భారీ డిమాండ్ సొంతం చేసుకొని సేల్స్ లో దూసుకుపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories