Motorola Edge 60 Fusion Launch: ఏఐ ఫీచర్లు భలే ఉన్నాయి.. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్.. ధర ఎంతంటే..?

Motorola Edge 60 Fusion Launch: ఏఐ ఫీచర్లు భలే ఉన్నాయి.. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్.. ధర ఎంతంటే..?
x
Highlights

Motorola Edge 60 Fusion Launch: మోటరోలా ఈరోజు భారత్‌లో మరో కొత్త ఫోన్ "Motorola Edge 60 Fusion"ని విడుదల చేసింది.

Motorola Edge 60 Fusion Launch: మోటరోలా ఈరోజు భారత్‌లో మరో కొత్త ఫోన్ "Motorola Edge 60 Fusion"ని విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్షన్ 7400 ప్రాసెసర్‌తో పరిచయం చేసింది. ఇందులో 12జీబీ వరకు ర్యామ్ ఉంది. ఇది మాత్రమే కాదు, 5,500mAh బ్యాటరీ అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. ఈ ఫోన్ IP68, IP69-రేటెడ్ డస్ట్,వాటర్-రెసిస్టెంట్, MIL-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. అలాగే 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ క్రమంలో ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 60 Fusion Price

దేశంలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 8GB + 256GB స్టోరేజ్ ధర రూ. 22,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే 12GB + 256GB వేరియంట్ ధర రూ. 24,999. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ నుండి త్వరలో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్, పాంటోన్ జెఫిర్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Motorola Edge 60 Fusion Features

మోటరోలా నుండి వచ్చిన ఈ కొత్త ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K ఆల్-కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా, వాటర్ టచ్ 3.0 , HDR10+ సపోర్ట్ కూడా ఫోన్‌లో కనిపిస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ అందించారు.

కెమెరా విషయానికొస్తే.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ బ్యాక్ OIS తో 50MP సోనీ లైటియా 700C సెన్సార్‌ ఉంది. అలానే 13MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. మోటో కెమెరా కోసం AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఎన్‌హాన్స్‌డ్ పోర్ట్రెయిట్ మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్, యాక్షన్ షాట్ వంటి ఇంటెలిజెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్‌లను అందించింది. సెల్ఫీలు, కాల్‌ల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories