New Car Sticker: మీ కారుకి HSRP స్టిక్కర్ ఉందా? లేకపోతే ఫైన్ కట్టాల్సిందే.. కొత్త రూల్ వచ్చింది

New Car Sticker
x

New Car Sticker: మీ కారుకి HSRP స్టిక్కర్ ఉందా? లేకపోతే ఫైన్ కట్టాల్సిందే.. కొత్త రూల్ వచ్చింది

Highlights

New Car Sticker: మీ కారుకి HSRP స్టిక్కర్ ఉందా? లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తెచ్చిన రూల్‌ని ఇక కఠినం కానుంది. దీనికి సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ చేసి, ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. స్టిక్కర్ ఇక మీ ఇంటికే వస్తుంది.

New Car Sticker: మీ కారుకి HSRP స్టిక్కర్ ఉందా? లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తెచ్చిన రూల్‌ని ఇక కఠినం కానుంది. దీనికి సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ చేసి, ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. స్టిక్కర్ ఇక మీ ఇంటికే వస్తుంది. దాన్ని మీ కార్ విండ్ షీల్డ్‌పై అంటించాలి.

ప్రతి కారుపైన HSRP స్టిక్కర్ ఉండాలని 2019లో సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అయితే ఇప్పటికీ దీన్ని ఎవరూ సరిగా ఫాలో కాలేదు. కానీ ఇక నుంచి ఈ HSRP స్టిక్కర్ ప్రతి కారుపైన ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ స్టిక్కర్ కార్‌‌పై లేకపోతే రిజిస్ట్రేషన్ బదిలీ, డూప్లికేట్ ఆర్సి, పియుసి సర్టిఫికేట్, వంటి సర్టిఫికేట్లు ఏవీ జారీ చేయబడవు.

అసలు HSRP స్టిక్కర్ అంటే ఏంటి?

HSRP(high security registration plates) అనేది ఒక హోలోగ్రామ్ స్టిక్కర్. అయితే ఇది ఏ వాహనానికి ఇస్తారంటే.. ఒక్కో ఇంధనాన్ని బట్టి ఒక్కో స్టిక్కర్ ఇస్తారు. అంటే పెట్రోల్, డీజెల్, గ్యాస్, ఎలక్ట్రిక్ ఇలా వివిధరకాల ఇంధనానికి వివిధ రకాల స్టిక్కర్లు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో బ్లూ, ఆరెంజ్, గ్రీన్ స్టిక్కర్లు ఉంటాయి. ఇందులో పెట్రోల్ వాహానాలకు బ్లూ స్టిక్కర్, డీజిల్ వాహనాలకు ఆరెంజ్ స్టిక్కర్, ఎలక్రిక్ వాహనాలకు గ్రీన్ స్టిక్కర్లను ఇస్తారు. అలాగే ఇతర వాహనాలకు బ్రౌన్ కలర్ స్టిక్కర్లు ఇస్తారు.

ఎక్కడ అమలు చేస్తున్నారు?

ఢిల్లీ కాలుష్యం అంతకంతకూ భయానకంగా మారుతోంది. ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తాజాగా కోర్టు HSRP స్టిక్కర్లను వెంటనే కార్లకు అతికించుకోవాలని, దీనివల్ల రోడ్డుపై ఏ కార్ వల్ల కాలుష్యం పెరుగుతుందో తెలుసుకోవచ్చని చెప్పింది. దీనికి కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ వరికే ఉన్నా త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కావొచ్చు.

స్టిక్కర్ లేకపోతే ఏం జరుగుతుంది?

సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ప్రతి కార్ దాని ఇంధనాన్ని బట్టి స్టిక్కర్‌‌ని దాని విండ్ షీల్డ్ పై అతికించాలి. ఇలా చేయకపోతే కొన్ని రకాల సర్టిఫికెట్లను జారీ చేయకపోవడంతో పాటు రూ. 2‌‌000లు నుండి రూ.5000 ల వరకు జరిమానాను విధిస్తారు.

ఈ స్టిక్కర్‌‌ని పొందాలంటే bookmuhsrp.com అనే వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ వాహనం నెంబర్, ఇంజిన్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేసుకుని, మీ ఇంటి అడ్రస్ ఇస్తే మీ ఇంటికే ఈస్టిక్కర్ వస్తుంది. ఇంకా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్‌ సైట్‌లోకి వెళ్లితే అన్ని వివరాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories