New Toyota Fortuner: కొత్త టయోటా ఫార్చ్యునర్.. హీటెక్కిస్తున్న ఫీచర్స్..!

New Toyota Fortuner: కొత్త టయోటా ఫార్చ్యునర్.. హీటెక్కిస్తున్న ఫీచర్స్..!
x

New Toyota Fortuner: కొత్త టయోటా ఫార్చ్యునర్.. హీటెక్కిస్తున్న ఫీచర్స్..!

Highlights

టయోటా ఫార్చ్యూనర్ అనేది అపారమైన ప్రజాదరణ పొందిన ఫుల్ సైజు ఎస్‌యూవీ. దీనికి చాలా చక్కని డిజైన్, డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి.

New Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ అనేది అపారమైన ప్రజాదరణ పొందిన ఫుల్ సైజు ఎస్‌యూవీ. దీనికి చాలా చక్కని డిజైన్, డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. 2026 ద్వితీయార్థంలో కొత్త జనరేషన్ 'ఫార్చ్యూనర్'ను విడుదల చేయడానికి కంపెనీ నిశ్శబ్దంగా సన్నాహాలు చేస్తోంది. ఇది హిలక్స్ పికప్ ట్రక్ ఆధారంగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త కారు అంచనా ధర, ఫీచర్లు గురించి వివరాలను తెలుసుకుందాం.

రాబోయే టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వెలుపల డిజైన్‌ చాలా అధునాతంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, దీనికి కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్ లభిస్తాయని చెబుతున్నారు. ఇది ప్లాటినం వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ బ్లాక్ క్రిస్టల్ షైన్, ఫాంటమ్ బ్రౌన్ రంగులలో కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త కారు పరిమాణంలో ఎటువంటి తేడా ఉండదని చెబుతున్నారు. ఇది 4795 మి.మీ పొడవు, 1855 మి.మీ వెడల్పు, 1835 మి.మీ ఎత్తు ఉంటుంది. అలానే 225 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2745 వీల్‌బేస్ ఉంటుంది. దీనిలో 7 సీట్లు ఉంటాయి. తద్వారా ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి ఇది 296 లీటర్ల బూట్ స్పేస్‌ ఉండే అవకాశం ఉంది.

టయోటా ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీలో శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ ఉంటుంది. దీని 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 బీహెచ్‌పి పవర్, 245 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుందని చెబుతున్నారు. మరో 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 204 బీహెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో ఉంటాయి. ఈ కారు లీటరుకు 11 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. అంతేకాకుండా టూ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉండటం కూడా సాధ్యమే.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ క్యాబిన్ డిజైన్ కూగా మెరుగ్గా ఉంటుంది. దీనిలో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, కనెక్టెడెడ్ కార్ టెక్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కిక్-టు-ఓపెన్ పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్-జోన్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి వివిధ ఫీచర్లు కూడా ఉంటాయి. ప్రయాణీకుల సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఇతర భద్రతా ఫీచర్లు అందించవచ్చు.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వేరియంట్‌ను బట్టి, ఇది రూ. 35 లక్షల నుండి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్ వంటి వాటి నుండి బలమైన పోటీని ఎదుర్కొంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories